భార్య చికెన్ వండిపెట్టలేదని.. ఫ్యానుకు ఉరేసుకున్నాడు..

క్షణికావేశాలను నిగ్రహించుకోలేక ప్రాణాల మీదకు తెచ్చుకునే వారు ఎక్కువవుతున్నారు. అలాగే అదే ఆవేశంలో నేరాలకు పాల్పడే వారి సంఖ్య కూడా పెరుగుతూనే వుంది. తాజాగా ఇంట్లో నాన్‌వెజ్ వండలేదనే చిన్న కారణంతో వ్యక్త

శనివారం, 11 ఆగస్టు 2018 (13:05 IST)
క్షణికావేశాలను నిగ్రహించుకోలేక ప్రాణాల మీదకు తెచ్చుకునే వారు ఎక్కువవుతున్నారు. అలాగే అదే ఆవేశంలో నేరాలకు పాల్పడే వారి సంఖ్య కూడా పెరుగుతూనే వుంది. తాజాగా ఇంట్లో నాన్‌వెజ్ వండలేదనే చిన్న కారణంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భార్యకు చికెన్ వండిపెట్టమని చెబితే పట్టించుకోలేదని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. యూసుఫ్‌గూడ, జవహర్‌నగర్‌లో సత్యనారాయణ(52), దేవకి దంపతులు ఉంటున్నారు. మద్యానికి బానిసైన సత్యనారాయణ ఇంట్లోనే ఉంటున్నాడు. దేవకి కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుంది. ప్రతిరోజు పూటుగా మద్యం తాగొచ్చి సత్యనారాయణ తరచూ భార్యతో గొడవ పడేవాడు. 
 
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భార్యతో వాగ్వాదానికి దిగాడు. తనకు చికెన్ చేసి పెట్టాలని భార్యతో చెప్పాడు. అయితే తాను పనికి వెళ్తున్నానని తిరిగి వచ్చిన తర్వాత చేసి పెడతానంది. అంతే సాయంత్రం ఇంటికొచ్చిన దేవికకు భర్తకు షాకే మిగిలింది. చికెన్ వండిపెట్టమని చెప్పిన భర్త.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కట్టుకున్న భార్య కేన్సర్‌తో చనిపోయింది.. భర్త కూడా ముగ్గురు పిల్లలకు విషమిచ్చి?