ఆదివారం (09-09-2018) దినఫలాలు... మీ మనసు మార్పును...

మేషం: ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే మంచిది. మీ తొందరపాటుతనం వలన వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం

ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (09:55 IST)
మేషం: ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే మంచిది. మీ తొందరపాటుతనం వలన వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. స్త్రీలకు ఆర్జన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
వృషభం: బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. రవాణారంగాల వారికి ప్రయాణికులతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. మీ మంచితనాన్ని త్వరలోనే కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. బంధువులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. 
 
మిధునం: కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. బాకీలు, ఇతరత్రా రావలసిన ఆదాయం అందుతుంది. స్త్రీలకు చిన్న విషయమే సమస్యగామారే ఆస్కారం ఉంది. ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది. బంధువుల రాక వలన చేపట్టిన పనులపై ఆసక్తి ఉండదు. విందులలో పరిమిత పాటించండి. మీ మనసు మార్పును కోరుకుంటుంది. 
 
కర్కాటకం: ముఖ్యులతో మాటపట్టింపు వచ్చే ఆస్కారం ఉంది. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ప్రయాణాలలో ఆశించినంత ఉత్సాహంగా సాగవు. భాగస్వామిక వ్యాపారాల నుండి విడిపోయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్పురిస్తుంది. సంస్థలలో పనిచేసే వారికి యజమానులకు లాభం చేకూరుతుంది.
 
సింహం: ప్రముఖుల ఇంటర్వ్యూకోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. లక్కీ డ్రాలు, ఫైనాన్స్ స్కీంల వలన నష్టపోతారు. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి.   
 
కన్య: దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధికమిస్తారు. మీరు ఊహించని వ్యయం అధికమవుతుంది. వాస్తవానికి మీరు నిదానస్తులైనప్పటికీ కొంత ఉద్రేకానికి లోనవుతారు. స్త్రీలు ఆడంబరాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. హోటలు, తినుబండ రంగాలలో వారికి కలిగిరాగలదు. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి.  
 
తుల: శ్రమించిన కొలదీ ఫలితం, కార్యసాధనలో అనుకూలతలుంటాయి. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీది కాని వస్తువును ఆశించడం వలన భంగపాటుకు గురవుతారు. వృత్తి, వ్యాపారాల్లో అవరోధాలు తొలగిపోతాయి. వాగ్వివాదాలకు దిగి సమస్యలు తెచ్చుకోకండి. ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి.  
 
వృశ్చికం: ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. విదేశాలు వెళ్ళాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. రిప్రజెంటేటివ్‌లకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడక స్వయం కృషిపైనే ఆధారపడడం మంచిది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం.
 
ధనస్సు: సమస్యలను శాంతి యుతంగా పరిష్కరించుకోవడం మంచిది. స్థిరాస్తి అమ్మకం వాయిదా వేయడం మంచిది. వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఆప్తుల రాకతో మానసికంగా కుదుటపడుతారు. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి.   
 
మకరం: రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పండ్లు, పూలు, కొబ్బరి వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడుతాయి. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. 
 
కుంభం: గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలుచేస్తారు. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేయదల్చుకున్న ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగవు. కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రుణం కొంత మెుత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుటపడుతారు.  
 
మీనం: మీ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని సహించరు. దూరప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు.  

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బాబా చెప్పిన అమృతతుల్యమగు పలుకులు