బుధవారం (05-09-2018) దినఫలాలు - సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి...

మేషం: ఉపాధ్యాయులకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. వస్త్ర, ఫ్యాన్సీ మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవదీక్షలు, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరు

బుధవారం, 5 సెప్టెంబరు 2018 (08:43 IST)
మేషం: ఉపాధ్యాయులకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. వస్త్ర, ఫ్యాన్సీ మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవదీక్షలు, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మాటతొందరపాటు తనం వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
వృషభం: నిర్మాణాత్మక పనుల్లో ఏకాగ్రత అవసరం. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఊహించని రీతిలో ధనలబ్ధి పొందుతారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఆశించిన మార్పులు వాయిదా పడగలవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. గతంలో చేజారిన పత్రాలు చేతికందుతాయి.  
 
మిధునం: ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయడం మంచిది. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. నిరుద్యోగులకు స్థిరమైన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
కర్కాటకం: ఉపాధ్యాయులు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మీ సంతానం వివాహ, ఉద్యోగ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్త్రీలకు చుట్టుప్రక్కల వారి నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆశయ సాధన కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. 
 
సింహం: ఆర్థిక విషయాలలో కొంత పురోగతి సాధిస్తారు. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత అవసరం. పట్టు విడుపు ధోరణితో వ్యవహరించండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి పథకాలు వేస్తారు. వాతావరణ ప్రతిబంధకాలు, శ్రమాధిక్యత తప్పవు. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండగలదు. 
 
కన్య: ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. గతంలో ఒకరికిచ్చిన హామీ వలన వర్తమానంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మెుదలు పెడతారు. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళకువ ఏకాగ్రత అవసరం. విదేశీయానం, రుణ యత్నాలు ఫలిస్తాయి.  
 
తుల: ముఖ్యులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. మీ తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
వృశ్చికం: ఉపాధ్యాయులు పై అధికారుల నుండి బహుమతులు స్వీకరిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలు కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. తీర్థయాత్రలు అనుకూలిస్తాయి.     
 
ధనస్సు: స్త్రీలకు ఆర్జన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కొంతమంది మీ నుండి ధనం ఆశిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.     
 
మకరం: రవాణా రంగాలవారు ప్రయాణీకులతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మిమ్మల్ని పొగిడే వారే సహకరించే వారుండరు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కుంభం: స్త్రీలు షాపింగ్‌లోను, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఎంతటి కష్టాన్నైనా మనోధైర్యంతో ఎదుర్కుంటారు. వ్యాపారాల్లో మెుహమ్మాటం వీడి లౌక్యం ప్రదర్శించండి. సభలు, సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి.  
 
మీనం: మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహానం కలిగిస్తాయి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. దైవ, సేవా, పుణ్య కార్యాలకు సహాయ సహకారలందిస్తారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బాబా... ఈ ధనమంతా మీది అన్నాడు... సాయి అలాగా అంటూ...