Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ సినిమా ఆగిపోయిందా..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. అమెరికాలో షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాలో ఇలియ‌నా న‌టిస్తోంది

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (12:07 IST)
మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. అమెరికాలో షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాలో ఇలియ‌నా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే... ర‌వితేజ సినిమా ఆగిపోయింది అనే వార్త ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ర‌వితేజ ప్ర‌స్తుతం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆగిపోయిందా అని ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు.
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే... త‌మిళంలో విజ‌యం సాధించిన తెరి చిత్రం మూల క‌థ‌ను తీసుకుని సంతోష్ శ్రీనివాస్ క‌థ రెడీ చేసారు. ఈ క‌థ‌తో ప‌వ‌న్‌తో సినిమా చేయాల‌నుకున్నారు కానీ అజ్ఞాత‌వాసి అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వడంతో ప‌వ‌న్ సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి రాజ‌కీయాల్లోకి వెళ్లారు. దీంతో ఈ క‌థ‌తో సంతోష్ శ్రీనివాస్ ర‌వితేజ‌తో సినిమా చేయాల‌నుకున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాని నిర్మించాలి అనుకున్నారు. 
 
అంతా ఓకే త్వ‌ర‌లోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అనుకుంటే... ఇంత‌లో ఈ సినిమా ఆగిపోయింద‌ని తెలిసింది. కార‌ణం ఏంటంటే... ర‌వితేజ న‌టించిన ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్టు ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అందుచేత అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని రిజెల్ట్ చూసిన త‌ర్వాత ఈ సినిమా చేయాలా వ‌ద్దా అని నిర్ణ‌యం తీసుకుంటార‌ట‌. అదీ..సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments