Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక ఫ్లాప్ దర్శకుడు... మరో ఫ్లాప్ హీరో... ఇద్దరూ కలిసి సినిమా చేద్దామనీ...

మాస్ మహారాజ్ రవితేజ దశాబ్ద కాలం ముందు వరకు వరుస సినిమాలతో బిజీగా ఉండేవాడు. మరి ఇప్పుడు వస్తున్న సినిమాలు వరుస పరాజయాలుగా నిలవడంతో ఒకింత ఆలోచనలో పడ్డాడు. రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, తాజాగా నేల టిక్కెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో రవి సిని

Advertiesment
ఒక ఫ్లాప్ దర్శకుడు... మరో ఫ్లాప్ హీరో... ఇద్దరూ కలిసి సినిమా చేద్దామనీ...
, సోమవారం, 4 జూన్ 2018 (18:47 IST)
మాస్ మహారాజ్ రవితేజ దశాబ్ద కాలం ముందు వరకు వరుస సినిమాలతో బిజీగా ఉండేవాడు. మరి ఇప్పుడు వస్తున్న సినిమాలు వరుస పరాజయాలుగా నిలవడంతో ఒకింత ఆలోచనలో పడ్డాడు. రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, తాజాగా నేల టిక్కెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో రవి సినిమా కెరీర్‌పై బాగా ప్రభావం కనిపిస్తోంది. సినిమాలు ఒకే మూస ధోరణిలో సాగుతుండటంతో ప్రేక్షకులు సైతం కాస్త ఇబ్బంది పడుతున్నారు. రవి సినిమాలలో ఇప్పటికీ కొత్తదనం ఏమీ కనిపించడం లేదు. 
 
ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక హిట్ కాంబినేషన్‌లో సినిమా రోబోతోంది. అందులోనూ రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఆ సినిమాను తీస్తున్నది డైరెక్టర్ శ్రీను వైట్ల. వీరిద్దరి కాంబోలో వచ్చిన నీకోసం, వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు భారీ హిట్‌లుగా నిలిచాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాని చేస్తున్నారు. మరోపక్క శ్రీనువైట్ల సైతం వరుస పరాజయాలతో డీలా పడి ఉన్నాడు. ఈ చిత్రం హిట్‌తో వీరిద్దరూ గట్టెక్కడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
తాజాగా రంగస్థలం సినిమాతో హిట్ కొట్టిన మైత్రి మూవీస్ నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఇలియానా మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇవ్వనుంది. అంతేకాకుండా అను ఇమ్మానుయేల్ కూడా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమె నటించిన గత సినిమాలు అజ్ఞాతవాసి, నా పేరు సూర్య చిత్రాలు సరిగా ఆడలేదు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక ఈ చిత్రం ఫలితంపైనే అందరి ఆశలు ఉన్నాయి. మరి శ్రీనువైట్ల ఒక హిట్‌తో తాను గట్టెక్కడమేగాక అందరికీ మరపురాని విజయాన్ని అందిస్తాడని యూనిట్ సభ్యులందరూ కోటి ఆశలు పెట్టుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ‌ర్మ ఇచ్చిన షాక్‌కు నాగ్ వేదాంతం... కింగ్ ట్వీట్‌కు వర్మ 'ఆమెన్' రీ-ట్వీట్