Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జిల్ జిల్ జిగేలు రాణి'ని నట్టేట ముంచారు.. ఎవరు?

రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేలు రాజ పాట ఎంత హిట్టయ్యిందో పెద్దగా చెప్పనక్కర్లేదు. సినిమాలోని ఈ పాట యువకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఐటెం సాంగ్‌లో నటించిన పూజా హెగ్డేకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ పాట పాడిన గాయనికి మాత్రం తీవ్ర అన్యాయం జరిగిం

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (11:59 IST)
రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేలు రాజ పాట ఎంత హిట్టయ్యిందో పెద్దగా చెప్పనక్కర్లేదు. సినిమాలోని ఈ పాట యువకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఐటెం సాంగ్‌లో నటించిన పూజా హెగ్డేకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ పాట పాడిన గాయనికి మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది. అసలు ఈ పాట పాడింది ఎవరో ఇప్పటికీ చాలామందికి తెలియదు. 
 
ఈ పాట పాడింది ఒక సాధారణ గృహిణి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన వెంకటలక్ష్మి అనే మహిళ ఈ పాటను పాడింది. రెండురోజుల పాటు చెన్నైలో ఉన్న వెంకటలక్ష్మి జిగేలు రాజ పాట పాడింది. అసలు ఈమెకు ఎలా ఆ అవకాశం వచ్చిందంటే బుర్రకథల్లో ఎన్నో పాటలు పాడిన వెంకటలక్ష్మిని దర్శకుడు సుకుమార్ యూ ట్యూబ్ ద్వారా చూశారు. దీంతో ఆమెను తీసుకురావాలని కొంతమందికి సూచించారు. మధ్యవర్తులు కొంతమంది వెంకటలక్ష్మిని తీసుకెళ్ళి పాట పాడించారు. సినిమా వందరోజులు పూర్తి చేసుకుంది.
 
కానీ ఇంతవరకు వెంకటలక్ష్మికి మాత్రం రెమ్యునరేషన్ మాత్రం ఇవ్వలేదట. ఇదే విషయాన్ని వెంకటలక్ష్మి మీడియాకు వివరించింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. తన వద్ద దర్శకుడు నెంబర్ గానీ, సంగీత దర్సకుడు దేవిశ్రీ ప్రసాద్ ఫోన్ నెంబర్లు లేవని, ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిని సంప్రదించేవారినని చెబుతోంది వెంకటలక్ష్మి. తన రెమ్యునరేషన్ మొత్తాన్ని మధ్యవర్తులే స్వాహా చేసి ఉంటారని ఆరోపిస్తోంది. వెంకటలక్ష్మి అనకాపల్లిలో ఒక చిన్న ప్రొవిజన్ షాపును నడుపుతోంది. నిరుపేద కుటుంబంలో ఉన్న తమను దర్శకుడు సుకుమార్ ఆదుకోవాలని కోరుతోంది వెంకటలక్ష్మి.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments