Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ మహేష్‌ బాబును అన్న అని పిలిచిన హీరోయిన్

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (22:15 IST)
సరిలేరు నీకెవ్వరు సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నెల సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. వరుస విజయాల డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఈ సినిమా పెద్ద పరీక్షే. మహేష్ బాబు లాంటి హీరోతో సినిమా అంటే సాధారణమైన విషయం కాదు. అది కూడా లేడీ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన విజయశాంతిని మళ్ళీ తెరపైకి తీసుకురావడం. దీంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
 
సినిమా విడుదలపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతుంటే హీరోయిన్ రష్మిక మాత్రం మహేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షూటింగ్‌కు వచ్చినప్పటి నుంచి మహేష్ బాబు సైలెంట్‌గా కూర్చుంటారు. అసలు ఎవరితోను మాట్లాడరు. దర్శకుడు సన్నివేశాన్ని చెబితే ఆ సన్నివేశంపై ప్రాక్టీస్ చేస్తారు. అది కూడా ఒక్కరే. ఇక పాటలంటారా. డ్యాన్స్ కంపోజ్ సైలెంట్‌గా ఒక్కరే చేసుకుంటూ ఉంటారు.
 
నేను చాలాసార్లు మహేష్‌తో మాట్లాడదామని ట్రై చేశాను. కానీ ఆయన హాయ్.. హల్లో అంటూ వెళ్ళిపోయారు. సినిమా షూటింగ్ చివరి దశలో ఒంటరిగా కూర్చుని ఉన్న మహేష్‌ను ఆటపట్టిద్దామని అన్నా అని పిలిచా.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నావైపు చూశారు మహేష్. దీంతో చాలాసేపు ఇద్దరం నవ్వుకున్నాం. ఎందుకలా పిలిచావని మహేష్ నన్ను అడగలేదు. ఎందుకంటే నేను తమాషాగా ఆట పట్టిద్దామని అలా పిలిచినట్లు మహేష్ బాబుకు బాగా అర్థమైంది కాబట్టి ఆయన ఆ విషయాన్ని లైట్‌గా తీసుకున్నారని చెబుతోంది రష్మిక. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments