Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ బిజినెస్ ఎంతో తెలుసా..?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (17:20 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్- మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కిస్తోన్న‌ భారీ మల్టీస్టారర్ ప్రారంభోత్సవం ఇటీవలే ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. బాహుబలి తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రారంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర క‌థ గురించి కొన్ని కథలు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారంలో ఉన్నాయి కానీ.. రాజ‌మౌళి మాత్రం క‌థ విష‌యంలో ఎలాంటి క్లూ ఇవ్వ‌లేదు.
 
కాగా ఈ సినిమా బిజినెస్ ఎంత జ‌ర‌గ‌నుంది అనేది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ఈ సినిమా హక్కులు అన్ని భాషలు కలుపుకొని 350 కోట్ల వరకు డిమాండ్ ఉంటుందని అంచ‌నా. ఇక‌ శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులకు మరో 150 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వ‌ర‌వాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు (న‌వంబ‌ర్ 19) నుంచే హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీ షూటింగ్ ప్రారంభించారు. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల పైన యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రించ‌నున్నారు. సెకండ్ షెడ్యూల్ ఫిబ్ర‌వ‌రిలో ఉంటుంద‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments