Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ లోనే మూవీ టైటిల్ ఉందా..?

Advertiesment
రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ లోనే మూవీ టైటిల్ ఉందా..?
, సోమవారం, 12 నవంబరు 2018 (10:07 IST)
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ హైద‌రాబాద్‌లో సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందే ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ అంటూ ఈ మూవీని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను అస‌లు క‌థ ఏంటి..?  టైటిల్ ఏంటి..? అంటూ ప‌లు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. 
 
ఆర్ఆర్ఆర్ అంటే... రాజ‌మౌళి, రామారావు, రామ‌చ‌ర‌ణ్ అని అనుకున్నారు. ఇప్పుడు ఇందులోనే టైటిల్ ఉంది అంటూ ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... ఆర్ఆర్ఆర్ అంటే.. రామ రావ‌ణ రాజ్యమట‌. ఈ టైటిల్‌నే సినిమాకు ఫిక్స్ చేయనున్నారని.. జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే... ఈ టైటిల్ పైన ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలుబడలేదు. ప్ర‌చారంలో ఉన్న ఈ టైటిల్ నిజ‌మేనా..? లేక వేరే టైటిల్ పెడ‌తారా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీటూపై స్పందిస్తా.. పోకిరి చిత్రం అలా నిలిచిపోయింది : ఇలియానా