Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"రామారావు - రామ్ చరణ్ - రాజమౌళి".. క్రేజీ ప్రాజెక్టు ప్రారంభమైంది...

Advertiesment
, ఆదివారం, 11 నవంబరు 2018 (14:19 IST)
"ఆర్.ఆర్.ఆర్.. రామారావు - రామ్ చరణ్ - రాజమౌళి" కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మల్టీస్టారర్ మూవీ ఆదివారం ఉద‌యం 11 గంటలకు అతిరథమహారథుల సమక్షంలో ప్రారంభ‌మైంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్‌లు కీలక పాత్రలను పోషిస్తుండగా, ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తన నిర్మాత సంస్థ డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించనున్నారు. 
 
ఆదివారం జరిగిన పూజా కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాజమౌళి, హీరోలు ప్రభాస్, రానా, మహేష్ బాబులతో పాటు.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు. కొద్ది రోజులుగా ట్రైనర్ స్టీవ్స్‌ లాయిడ్‌ ఆధ్వర్యంలో క‌స‌ర‌త్తులు చేస్తున్న ఎన్టీఆర్ ప్ర‌స్తుతం డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు.
webdunia
 
అదేసమయంలో గత కొన్ని రోజులుగా ఈ చిత్రం పలు టైటిల్స్‌తో ప్ర‌చారమైంది. దీంతో టైటిల్‌ను వెల్లడిస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, పూజా కార్య‌క్రమంలో చిత్ర క్లాప్ బోర్డ్ ఉంచ‌గా, దానిపై "ఆర్ఆర్ఆర్" అని మాత్ర‌మే రాసి ఉంది. దీంతో అంద‌రు 'రామ రావణ రాజ్యం' అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌నే చిత్రానికి పెట్టి ఉంటార‌ని భావిస్తున్నారు. 
 
కీరవాణి చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. వ‌చ్చే నెల‌లో ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళేలా రాజమౌళి స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ని స‌మాచారం. చిత్రంలో ఓ క‌థానాయిక‌గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుండ‌గా, మ‌రో హీరోయిన్ స‌మంతను తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈచిత్రానికి సంబంధించి మిగిలిన అంశాలపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉచిత మిక్సీ, గ్రైండర్, ఫ్యాన్లను మంటల్లో తగలబెడుతున్న హీరో ఫ్యాన్స్...