హ‌రీష్ శంక‌ర్‌కి షాక్ ఇచ్చిన పూజా హేగ్డే... టెన్ష‌న్‌లో 'గబ్బర్ సింగ్' డైరెక్టర్

Webdunia
మంగళవారం, 14 మే 2019 (19:27 IST)
వ‌రుణ్ తేజ్‌తో డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం వాల్మీకి. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే... ఈ సినిమా ఫిల్మ్ ఇండ‌స్ట్రీ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది. అందుచేత ఈ సినిమాలో హీరోయిన్‌గా క‌నిపించే పాత్ర‌కు పూజా హేగ్డేను ఎంపిక చేసార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ పాత్ర చేయ‌డానికి ఆమె ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసిందని ప్ర‌చారం జ‌రిగింది. 
 
ప్ర‌చారంలో ఉన్న వార్త‌లపై హ‌రీష్ శంక‌ర్ స్పందించి అలాంటిదేమీ లేద‌ని ఈ వార్త‌ల‌ను ఖండించారు. అయితే... ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో ఏమో కానీ... డేట్స్ ఎడ్జెస్ట్ చేయ‌లేను అంటూ ఈ సినిమా నుంచి త‌ప్పుకుంది. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఏం జ‌రిగిందో అని... పూజా మాత్రం బాలీవుడ్‌లో చేయాల్సిన సినిమాలు ఉన్నాయి అందుచేత ఈ సినిమా చేయ‌లేక‌పోతున్నాను అని చెప్పింద‌ట‌. 
 
పూజా ఇచ్చిన షాక్‌కి హ‌రీష్ శంక‌ర్ బాగా ఫీల‌య్యాడ‌ట‌. ఆమె స‌క్స‌స్‌లో లేన‌ప్పుడు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి తీసుకువ‌స్తే.... ఇప్పుడు త‌న‌కు ఇలా షాక్ ఇచ్చింద‌ని తెగ ఫీల‌వుతున్నాడ‌ట‌. చేసేదేం లేక వేరే హీరోయిన్ కోసం మ‌ళ్లీ అన్వేష‌ణ ప్రారంభించాడ‌ట‌. పూజా వ‌దిలేసిన పాత్రను ఏ హీరోయిన్ చేస్తుందో మరి?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments