Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడేళ్ల తర్వాత ఇంటికొచ్చిన భర్త... బెడ్ పై భార్యతో నిద్రిస్తున్న మరో యువకుడు...

Advertiesment
మూడేళ్ల తర్వాత ఇంటికొచ్చిన భర్త... బెడ్ పై భార్యతో నిద్రిస్తున్న మరో యువకుడు...
, శుక్రవారం, 10 మే 2019 (14:38 IST)
పక్కింటి పడతిని కన్నెత్తయినా చూడకుండా ఉంటే నా భర్త శ్రీరామచంద్రుడు అని చెబుతుంది భార్య. మరి పెళ్ళయి ఒక బాబు కూడా ఉండి భార్య మరొక వ్యక్తిని ప్రేమిస్తే అతనికే భార్యను ఇచ్చి పెళ్ళి చేసిన భర్తను ఏమనాలి. సినిమా స్టోరీని తలపించేలా జరిగిన ఈ ఘటన బీహార్ లోని భాగల్‌పూర్‌లో జరిగింది.
 
సాలేపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి.. అదే గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహమైంది. ఆ దంపతులకు ఒక బాబు కూడా పుట్టాడు. ఆనందంగా సాగుతున్న సంసారంలో అనుకోని అవాంతరం వచ్చింది. భర్త ఓ కేసులో అరెస్టయి జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. దీంతో భార్య కొడుకును పెట్టుకుని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న ఆమెతో ఇంటి యజమాని కొడుకు పరిచయం పెంచుకున్నాడు. వారి పరిచయం ప్రేమగా మారింది.
 
జైలుశిక్ష పూర్తి చేసుకున్న భర్త ఇంటికి వచ్చాడు. మూడేళ్లుగా భార్యాబిడ్డలను దగ్గరుండి చూసుకోక బాధపడ్డ ఆ భర్త ప్రేమగా ఇంట్లో అడుగుపెట్టిన సమయానికి ఆ ఇంటి యజమాని కొడుకు తన భార్యతో బెడ్ పైన నిద్రించడం చూసి షాకయ్యాడు. భార్య ఇంటి యజమాని కొడుకుతో ప్రేమలో ఉందని తెలుసుకున్నాడు. ఆమెతో ఇదివరకటిలా ఉండలేకపోయాడు. గతంలోలా తన భార్య తనతో ఉండదని గుర్తించాడు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో భార్యను ప్రేమించినవాడితో ఇచ్చి పెళ్ళిచేయడమే సరైన నిర్ణయమని భావించాడు. మరో ఆలోచన లేకుండా వారి పెళ్ళికి ఏర్పాట్లు చేశాడు. పెద్ద మనస్సుతో వారిద్దరినీ ఆశీర్వదించాడు. రెండున్నరేళ్ళ బిడ్డను వారికే ఇచ్చి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త శవాన్ని ఇంటిలో పెట్టుకుని ఓటు వేసి వచ్చిన భార్య... ఎక్కడ?