తారక్ అభిమానుల గుండెల్లో గుబులు, ఇంతకీ ఏమైంది..?

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (17:42 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
 
ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే... ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. అయితే.. చరణ్ పాత్రకు సంబంధించి టీజర్ రిలీజ్ చేసారు కానీ.. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయలేదు.
 
 కరోనా కారణంగా షూటింగ్ ఆగింది. ఇటీవల ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్టార్ట్ చేసారు. ఈ నెల 22న తారక్ పాత్రకు సంబంధించి టీజర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో తారక్ అభిమానులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
 
ఎప్పుడెప్పుడు అక్టోబర్ 22న వస్తుందా టీజర్ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తుంటే... ఇప్పుడు వర్షాలు కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది. అందుచేత మళ్లీ ఎక్కడ తారక్ పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ ఆగిపోతుందేమో అని తారక్ అభిమానుల గుండెల్లో గుబులు మొదలైందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments