Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రవాసాంధ్రులతో బాలయ్య ప్రత్యక్ష సమావేశం: 60వ జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

Advertiesment
Nandamauri BalaKrishna
, గురువారం, 11 జూన్ 2020 (21:46 IST)
జూన్ 11న ప్రముఖ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమెరికాలోని ప్రవాసాంధ్ర బాలకృష్ణ అభిమానులను ఉద్దేశించి జూమ్ అప్ ద్వారా వారితో ఇష్టాగోష్ఠి జరిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే అమెరికా వ్యాప్తంగా బాలకృష్ణ అభిమానులు ఆయన షష్టి పూర్తి(60) జన్మదినం సందర్భంగా అమెరికా వ్యాప్తంగా వివిధ నగరాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, పోస్టల్ శాఖ మరియు అగ్నిమాపక సిబ్భందికి భోజనం, నిత్యావసర వస్తువులు, మాస్కులు, గ్లోవ్సులు, శానిటైజర్స్ మొదలుగునవి పంపిణి చేశారు.
 
బాలకృష్ణతో జరిగిన ఈ అభిమానుల సమావేశంలో వివిధ మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున అమెరికాలోని బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మన్నవ మోహనకృష్ణ, రవి పొట్లూరి నిర్వహించారు. ప్రవాసాంధ్రులు జై బాలయ్యా అంటూ, బాలయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
 
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా అమెరికా వ్యాప్తంగా తన అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ తను గతంలో ఎప్పుడు అమెరికా వచ్చినా అభిమానులు బ్రహ్మరథం పట్టారని, వారి అభిమానాన్ని, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. గౌతమీపుత్ర శాతకర్ణి విడుదల సందర్భంగా విమానాశ్రయం నుండి అడుగడుగునా తనపై చూపించిన అభిమానానికి ఎంతో ముగ్ధుడైనానని తెలియచేసారు.
 
ఈ కార్యక్రమంలో ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న నటీమణులు లయ, అంకిత పాల్గొన్నారు. ఇంకా యాంకర్ రవి, ఇమిటేషన్ రాజు, గాయని గాయకులు కౌశల్య, సింహ, పృథ్వి పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలు వెల్లుల్లి రసం తప్పక తీసుకోవాలట.. ఎందుకో తెలుసా? (Video)