Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలా.. జరగడానికి రామానాయుడు గారే కారణం: సి.కళ్యాణ్

అలా.. జరగడానికి రామానాయుడు గారే కారణం: సి.కళ్యాణ్
, శనివారం, 6 జూన్ 2020 (14:07 IST)
మూవీ మొగల్ డా.డి రామానాయుడు 85 వ జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగింది. ‌ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, సి.కల్యాణ్, కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్యనారాయణ జె. బాలరాజు పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
 
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ... 85వ జయంతి సందర్భంగా రామానాయుడు ‌గారికి నివాళులు అర్పించాము. రామానాయుడు గారు లేకుంటే హైదరాబాదులో సినిమా పరిశ్రమ, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ఉండేది కాదు. ఫిలిం నగర్‌లో విగ్రహంతో పాటు, రామానాయుడు గారి పేరుతో ఏది మొదలు పెట్టినా సక్సెస్. ఫిలింనగర్‌కు చెన్నారెడ్డి, దాసరి, రామానాయుడు గారు దేవుళ్ళు లాంటి వారన్నారు.
 
నిర్మాత సి‌.కల్యాణ్ మాట్లాడుతూ .. రామానాయుడు గారంటే మాకు ఓ హీరో, రోల్ మోడల్. నన్ను దాసరి గారు, రామానాయుడు గారు ఎంతో ప్రొత్సహించిన వ్యక్తులు. నిర్మాతలగానే కాకుండా, సినీ పరిశ్రమ, దానికి అనుంబంధ ఆఫీసులన్నీ డెవలెప్ కావటానికి రామానాయుడు గారే కారణం. నాయుడు గారిని తలుచుకుని మేము సినిమా స్టార్ట్ చేస్తాము. ఆయన జయంతిని ఎప్పుడు గొప్పగా జరుపుకుంటామన్నారు.
 
రామానాయుడు గారి వారసుడిగా అభిరామ్ ఆయన ప్లేస్‌ను ఫిల్ చెస్తాడన్నారు. అనంతరం రామానాయుడు గారి మనవడు అభిరామ్ మాట్లాడుతూ.. తాత గారు ఫిజికల్‌గా లేకున్నా, మెంటల్‌గా నాకు సపోర్ట్‌గానే ఉంటారన్నారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ.. నిర్మాతగా నాకు రామానాయుడు గారే స్పూర్తి.‌ వారి ఫాలోవర్‌గా సినిమాలు చేశాను. మా బ్యానర్లో మంచి సినిమాలు రావటానికి నాయుడు గారి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వలస కార్మికులకు దేవుడు.. రైళ్లు, బస్సులు కాదు.. ఫ్లైట్ బుక్ చేశాడు..