Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళలు వెల్లుల్లి రసం తప్పక తీసుకోవాలట.. ఎందుకో తెలుసా? (Video)

మహిళలు వెల్లుల్లి రసం తప్పక తీసుకోవాలట.. ఎందుకో తెలుసా? (Video)
, గురువారం, 11 జూన్ 2020 (16:03 IST)
Garlic Juice
మహిళలు తప్పకుండా రోజుకు అర కప్పు వెల్లుల్లి రసం తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం, పావుగ్లాసు గోరు వెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే మహిళల్లో నడుం నొప్పి తగ్గుతుంది. వెల్లుల్లిని కాస్త నీటిలో మరిగించి ఆ నీటిని ఉదయం పరగడుపున తాగడం వల్ల బరువు తగ్గుతారు. 
 
వెల్లుల్లిపాయలు నాలుగు ఒక చెంచా నువ్వుల నూనెలో వేయించి అందులో సైంధవ లవణం కలిపి తింటే నడుం నొప్పి తగ్గిపోతుంది. లావుగా ఉండి నడుంనొప్పి వుంటే పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో నిమ్మ రసం పోసి పరగడుపున తాగితే ఒళ్లు తేలికపడి నొప్పి తగ్గుతుంది.
 
ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవునెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను ముంచి నడుం చుట్టూ కాపు పెడుతుంటే నడుంనొప్పి తగ్గిపోతుంది. అలాగే ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కాస్త వెల్లుల్లి రసాన్ని కలిపి రోజూ ఉదయం తాగితే శృంగార సంబంధిత సమస్యలు తలెత్తవు.
 
ఆవనూనె, నువ్వుల నూనె వేడిచేసి నడుముకు మర్ధనచేసుకుని వేడి నీళ్ళతో స్నానం చేస్తే, నడుంనొప్పి తగ్గుతుంది. బట్టతల ఏర్పడిన ప్రదేశంలో కొద్దిగా వెల్లుల్లి రసం రాస్తే అక్కడ జుట్టు బాగా పెరుగుతుంది. మగవారిలో సెక్స్ సామర్ధ్యం సన్నగిల్లడం, నరాల బలహీనత, శీఘ్రస్ఖలనం తదితర సమస్యలుంటే తరచుగా వెలుల్లిని ఆహారంలో తీసుకోవడం వల్ల లైంగికపటుత్వం పెరుగుతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్త్రీ పురుషుల్లో శృంగార సమర్థతను పెంచే మెంతికూర..