Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మన్మథుడు"ని ఆలోచనలో పడేసిన 'గ్యాంగ్ లీడర్'

Webdunia
సోమవారం, 20 మే 2019 (16:20 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూపొందించిన 'మన్మథుడు'కి సీక్వెల్‌గా అక్కినేని నాగార్జున - యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్‌లో 'మన్మథుడు 2' రూపొందుతోంది. అన్నపూర్ణ బ్యానర్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తూండగా, సమంత ఒక ప్రత్యేక పాత్రలో నటించనుంది. 
 
ఇటీవలే పోర్చుగల్‌లో ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాని...  నాగ్ ఆగస్టు చివరిలో విడుదల చేయాలనుకున్నారట. అయితే ఈ సినిమాకి నేచురల్ స్టార్‌ నానీ రూపంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయట. 
 
వివరాలలోకి వెళ్తే... నాని కథానాయకుడిగా నటిస్తోన్న 'గ్యాంగ్ లీడర్' కూడా ఆగస్టు 30వ తేదీన విడుదల కానున్నట్లు... సదరు సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ నిన్న విడుదల చేయబడిన స్పెషల్ పోస్టర్ వెల్లడించింది. దీనితో ఆ తేదీకి దాదాపు కాస్త అటు ఇటుగా వద్దామనుకున్న నాగార్జున ప్రస్తుతం ఆలోచనలో పడ్డారట. 
 
ఈ మధ్య కాలంలో సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నాగార్జునకి ప్రస్తుతం సోలో రిలీజ్ చాలా అవసరమైన నేపథ్యంలో... నానీ సినిమాకి .. తన సినిమాకీ కనీసం వారం రోజుల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments