Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహమాటాలకు వెళ్లను.. అలాంటి పాత్రల్లో కనిపించను.. ఐశ్వర్య రాజేశ్

Webdunia
సోమవారం, 20 మే 2019 (15:42 IST)
తమిళంలో వరుస సినిమాలతో హిట్ కొడుతున్న ఐశ్వర్య రాజేశ్.. తాజాగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తమిళంలో ''కనా'' (కల) చిత్రంలో ఈమె నటించింది. కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తీకేయన్‌ కీలక పాత్ర పోషిస్తూ.. నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ క్రికెటర్‌గా కనిపించింది. 
 
ఈ సినిమాలో క్రికెటర్ కావాలనుకుని.. వరల్డ్ కప్ టీమ్‌లో చోటు సంపాదించుకుని తన సత్తా చాటుకునే కీలక పాత్రలో అదరగొట్టిన ఐశ్వర్యా రాజేష్.. క్రికెట్‌ను ఇంత సీరియస్‌గా తీసుకున్న మనకు వ్యవసాయాన్ని ఒక ఆటగా కూడా చూసేందుకు ఎందుకు మనసు రావట్లేదని సందేశం ఇచ్చింది. వ్యవసాయాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోవట్లేదని దర్శకుడు ఈ సినిమా ద్వారా సందేశం ఇచ్చాడు. 
 
ఇక ఐశ్వర్యా రాజేష్ ఎవరో కాదు.. తెలుగులో 'మల్లెమొగ్గలు'తో హీరోగా పరిచయమైన రాజేశ్ కూతురు. తాజాగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేయనున్న సినిమా ద్వారా తెలుగు తెరకి కథానాయికగా పరిచయం కానుంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో ఐశ్వర్య రాజేశ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంతకుముందు అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు పోషించాల్సి వచ్చింది. ఇకపై ప్రాధాన్యత గల పాత్రల్లోనే కనిపిస్తానని చెప్పింది. ఆ తరహా పాత్రల్లో ఒకటి 'సామీ స్క్వేర్'లో చేశాను.

ఆ సినిమాలో రెండో కథానాయికగా ఎంత మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను. ఇకపై ఎలాంటి మొహమాటాలకు వెళ్లదలచుకోలేదు .. అలాంటి పాత్రలను చేయదలచుకోలేదు" అని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments