Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరిని చిరంజీవి రీప్లేస్ చేయాలనుకుంటున్నారా?

Webdunia
సోమవారం, 20 మే 2019 (15:25 IST)
దర్శకరత్న దాస‌రి నారాయ‌ణ‌రావు... చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రి సినిమాల‌కు వెళ్లి తన వంతు మద్దతు తెలిపేవాడు. మెగా తమ్ముడు... ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వ‌చ్చి ఎలా ఆశీర్వదించేవాడో.. అలాగే రాజ్ త‌రుణ్ సినిమాకు కూడా వ‌చ్చేవాడు‌. ఆ రకంగా చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్నింటా తానై ఉండిన ఆయ‌న పోయిన త‌ర్వాత చిన్న సినిమాల‌కు పెద్ద‌ దిక్కు లేకుండా పోయింది. 
 
అయితే తాజాగా ఆ దర్శకరత్న లేని లోటుని తీర్చ‌ేందుకు మెగా హీరో చిరంజీవి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య ఈయ‌న కూడా చిన్న సినిమాల ఆడియో వేడుకుల‌కు వెళ్తున్నాడు. ఇటీవలి కాలంలో చిత్ర పరిశ్రమలోని ఏ ఫంక్షన్‌లో చూసినా చిరంజీవి ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాడు. 
 
తాజాగా పీపుల్స్ స్టార్‌ ఆర్‌ నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థ స్నేహచిత్ర పిక్చర్స్‌ పతాకంపై రూపొందించిన సినిమా "మార్కెట్లో ప్రజాస్వామ్యం". ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకి సంబంధించిన ఆడియో వేడుక మే 21న ప్రసాద్ ల్యాబ్స్‌లో జ‌ర‌గ‌నుంది.
 
దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడట. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. నారాయ‌ణ‌మూర్తి సినిమా ఆడియో వేడుక‌కు చిరంజీవి రావ‌డం అంటే నిజంగా గొప్ప విష‌య‌మే. అస‌లు విడుదలవుతున్నాయో లేదో తెలియని నారాయణమూర్తి సినిమాలకు సంబంధించిన ఆడియో ఫంక్షన్‌కి చిరంజీవి రావ‌డం అంటే తక్కువేమీ కాదుగా... అయితే నారాయ‌ణ‌మూర్తి కూడా దాస‌రిని దేవుడిగా భావించే దాసరి శిష్యుడే... మొత్తానికి చిరంజీవి ఈ వేడుకకి వ‌చ్చి ఈ పీపుల్స్ స్టార్ గురించి ఏం మాట్లాడతారో... దాసరి లోటుని ఎంత మేరకు భర్తీ చేస్తారో.. వేచి చూద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments