ఈసారి అసెంబ్లీలో పవన్ కల్యాణ్ అడుగుపెట్టబోతున్నారు.. లగడపాటి

శనివారం, 18 మే 2019 (18:44 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని ఎన్నికల ఫలితాల కాలజ్ఞానిగా పేరున్న లగడపాటి రాజగోపాల్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కంటే ఆయన తమ్ముడు తక్కువే.. అంటే పవన్‌కు ప్రజారాజ్యం కంటే తక్కువ సీట్లు వస్తాయన్నారు. ఏపీలో హంగ్ వచ్చే అవకాశం లేదని లగడపాటి తేల్చేశారు. 
 
ఏపీలో గెలిచే పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని.. సర్వే పూర్తి వివరాలు ఆదివారం వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. తన ఎన్నికల ఫలితాలను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. తెలుగుదేశం పార్టీ కంటే వైకాపానే తాను సన్నిహితంగా వుంటానని.. జగన్‌ను వివేకా హత్యోదంతం సందర్భంగా కలిశానని చెప్పారు. ఆదివారం సాయంత్రం తిరుపతిలో ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. 
 
అయితే గత తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి సర్వే పూర్తిగా తప్పిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, టీడీపీలు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తాయని లగడపాటి చెప్పిన జోస్యానికి విరుద్దంగా టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏపీ ఎన్నికల సందర్భంగా మరోసారి తెలంగాణ ఫలితాలను ఆయన ప్రస్తావించారు.
 
తెలంగాణలో తన సర్వేకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో ఎందుకు తేడా వచ్చిందో తర్వాత వెల్లడిస్తాను. సర్వే రిపోర్టు ముందే చెప్పాలని చాలా మంది అడిగారు. రాజధాని ప్రాంత రైతులకు మాత్రం చెవిలో చెప్పాననని లగడపాటి వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తెలుగు రాష్ట్రాల ఆక్టోపస్.. ఎన్నికల పంచాంగం.. ఏపీలో సైకిల్... తెలంగాణలో కారు