Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్ మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్

Advertiesment
అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్ మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్
, గురువారం, 25 ఏప్రియల్ 2019 (22:06 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ మ‌రియు హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీత అందిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూసారు. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. 
 
హైదరాబాద్ బేగంపేట పోలీస్ లైన్స్‌లో తొలి షెడ్యూల్ షూటింగును ఆరంభించారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో టబు, బొమన్ ఇరాని, నవదీప్ కనిపించనున్నారు. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల‌తో విజ‌యాలు సాధించిన బ‌న్నీ, త్రివిక్ర‌మ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తార‌ని ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మ‌రి... కొంత గ్యాప్ త‌ర్వాత సినిమా చేస్తోన్న బ‌న్నీ ఈ సినిమాతో ఏరేంజ్ స‌క్స‌ెస్ సాధిస్తాడో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ విషయంలో వెనక్కి తగ్గిన విజయ్ దేవరకొండ