నా కేరీర్‌ను పాడు చేయకండి.. ప్రేమ వార్తలపై స్పందించిన ఐశ్వర్య

శనివారం, 18 మే 2019 (10:55 IST)
టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండతో తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రేమలో పడినట్టు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌ కోడైకూస్తోంది. దీనిపై ఆమె ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలపై ఐశ్వర్యా రాజేష్ స్పందిస్తూ, లేనిపోని పుకార్లు పుట్టించి తన సినీ కేరీర్‌ను నాశనం చేయొద్దని ప్రాధేయపడింది. 
 
"నాకు ఒక ప్రేమకథ వుందనీ.. ప్రేమలో ఉన్నాననే వార్తలను కొన్ని రోజులుగా వింటున్నాను. నేను ఎవరితో ప్రేమలో పడ్డాననే విషయం కూడా తెలుసుకోవాలని వుంది" అంటూ విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించకుండానే ట్వీట్ చేసింది. "నేను నిజంగానే ఎవరి ప్రేమలోనైనా పడటమంటూ జరిగితే ఆ విషయం నేనే చెబుతా. అనవసరమైన పుకార్లను నమ్మకండి. ప్రస్తుతం నా దృష్టి అంతా కూడా కెరియర్ పైనే వుంది" అంటూ ఆ ట్వీట్‌లో స్పష్టంచేసింది. 
 
కాగా, ఐశ్వర్యా రాజేష్‌కు తమిళంలో వరుస ఆఫర్లు వస్తున్నాయి. అలాగే, తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ఓ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించనున్నారు. అలాగే, మరికొంతమంది టాలీవుడ్ నిర్మాతలు ఆమెతో టచ్‌లో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తెలుగు హీరోలపై మనసుపడిన సోనీ చరిష్టా