Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్‌కి బాగా పెరిగింద‌ట..‌.

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (12:23 IST)
మ‌హాన‌టి సినిమాలో సావిత్రి పాత్ర‌ను అద్భుతంగా పోషించి తెలుగు వారి హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసింది కీర్తి సురేష్. ఈ సినిమా త‌ర్వాత ఆమెకు క్రేజ్ బాగా పెరిగింది. దీంతో కీర్తితో సినిమాలు చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇటీవ‌ల టాలీవుడ్ కింగ్ నాగార్జున మ‌న్మ‌థుడు 2 సినిమాలో గెస్ట్ రోల్ చేసింది కీర్తి. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేంద్ర ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.
 
అయితే... ఆమెకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఓ వైపు త‌మిళ్ నిర్మాతలు మ‌రోవైపు తెలుగు నిర్మాతలు పోటీప‌డి మ‌రీ కీర్తి కోసం క్యూ క‌డుతున్నాయి. నాగార్జున కెరీర్లో మ‌ర‌చిపోలేని చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. ఈ సినిమాకి సీక్వెల్‌గా బంగార్రాజు సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నాగార్జున‌తో పాటు నాగ చైత‌న్య కూడా న‌టించ‌నున్నాడు. ఇందులో చైత‌న్య స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఈ వార్త‌లు నిజ‌మే అని తెలిసింది. చైత‌న్య‌, కీర్తి సురేష్ క‌లిసి మ‌హాన‌టి సినిమాలో న‌టించారు. ఇప్పుడు మ‌ళ్లీ న‌టిస్తున్నారు. నితిన్‌తో కూడా న‌టించేందుకు కీర్తి సురేష్ ఓకే చెప్పింది. సో... కీర్తి సురేష్‌కి డిమాండ్ మామూలుగా లేదు. అందుక‌నే అనుకుంటా ఈ అమ్మడు ప్ర‌స్తుతం పారితోషికం పెంచే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments