సాధారణంగా ఎవరైనా సరే సినిమాల్లో నటించాలంటే డబ్బులు తీసుకుంటుంటారు. యువ హీరోలైతే వారికి ఉన్న క్రేజ్‌ను బట్టి వారు డబ్బులను నిర్మాతల నుంచి తీసుకుంటారు. కానీ యువ హీరో నాని మాత్రం ఒక సినిమాకు డబ్బులు తీసుకోలేదు. కారణం తనపై డైరెక్టర్ పెట్టుకున్న నమ్మకం. ఒక మధ్య తరగతి క్రికెటర్ పడే కష్టం. అతను పడే బాధ. క్రికెట్ కోసం అతను పడే తపన. ఈ కథతో తెరకెక్కిన చిత్రం జెర్సీ.
ఈ సినిమా గురించి చెప్పనవసరం లేదు. క్రికెట్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ కథను దర్సకుడు గౌతమ్ చెప్పినప్పుడు నానికి బాగా నచ్చిందట. ఈ సినిమాకు నేను డబ్బులు తీసుకోనని నిర్మాతకు చెప్పేశాడట నాని. ఈ సినిమా బాగా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. హిట్టయినప్పుడు నేను డబ్బులు తీసుకుంటా. లేకుంటే లేదు.
ఇలాంటి కథలు ఖచ్చితంగా రావాలన్నారట నాని. అనుకున్నట్లుగానే సినిమా భారీ విజయం సాధించి మంచి కలెక్షన్ల వైపు దూసుకెళుతోంది. కానీ నాని మాత్రం డబ్బులను మాత్రం నిర్మాత నుంచి తీసుకోలేదట. తాను ఒక నిర్మాతనేనని, ఒక మంచి కథ నచ్చినప్పుడు ఆ క్యారెక్టర్లో లీనమై నటిస్తే చాలని, అంతే తప్ప డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదని నాని చెప్పారట. విజయోత్సవ సభలో ఇదే విషయాన్ని నిర్మాత దిల్ రాజు చెప్పడంతో ఒక్కసారిగా కరతాళ ద్వనులతో సభాస్థలం మారుమ్రోగింది.