Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సారీరా జున్ను... తప్పలేదు.. కొడుకుకు సారీ చెప్పిన నేచురల్ స్టార్

Advertiesment
సారీరా జున్ను... తప్పలేదు.. కొడుకుకు సారీ చెప్పిన నేచురల్ స్టార్
, గురువారం, 18 ఏప్రియల్ 2019 (11:53 IST)
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న "జెర్సీ" సినిమాపై అభిమానులలో మంచి క్రేజ్ నెలకొంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మాజీ క్రికెటర్‌ రమణ్‌ లాంబా జీవితం ఆధారంగా తెరకెక్కించినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ, అందులో నిజం లేదని నాని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇక క్రికెట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాతో తనకు క్రికెట్ అంటే ఏంటో పూర్తిగా తెలిసొచ్చిందని కూడా చెప్పారు.
webdunia
 
తాజాగా నాని సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సముద్రం ఒడ్డున తన కుమారుడితో కూర్చుని కబుర్లు చెబుతున్నట్లుగా ఉన్న ఈ ఫోటోలో నాని వేసుకున్న టీషర్ట్‌పై అర్జున్‌ అని రాసుంది. అంతే కాకుండా క్యాప్షన్‌గా ‘సారీ రా జున్నూ.. తప్పలేదు’ అని ఇచ్చారు. అంటే.. సినిమాలో నాని పేరుగా తన కుమారుడి పేరు వాడుకున్నందుకు అర్జున్‌కు నాని సారీ చెబుతున్నారన్నమాట. ఈ ఫొటోను పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే లైక్‌లతో ముంచెత్తారు అభిమానులు. ‘సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అన్నా..’ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా జీవనరేఖలు వీరే... టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వైఫ్ పోస్ట్