Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా కథకు గ్యాంగ్ లీడర్ టైటిల్ మాత్రమే సూటవుతుంది : నాని

Advertiesment
మా కథకు గ్యాంగ్ లీడర్ టైటిల్ మాత్రమే సూటవుతుంది : నాని
, శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (09:16 IST)
క్లాసిక్‌ మూవీగా నిలిచిపోయిన 'గ్యాంగ్ లీడర్' సినిమా టైటిల్‌ను మరో సినిమాకి పెట్టడం అభిమానులు సహించలేరు. అసలు ఆ మూవీని మెగా హీరోలు వాడితేనే ఒప్పుకోరు. ఆ మధ్య నాని విక్రమ్ కుమార్‌ల కాంబో సినిమాకు 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు మెగా ఫాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మెగా హీరోలు ఉపయోగిస్తేనే ఒప్పుకోనిది నాని లాంటి సాఫ్ట్ హీరోలకు పెట్టుకోవడం ఏంటని సోషల్ మీడియాలో రచ్చ చేసారు. 
 
ఇదిలా ఉండగా మరో దర్శక నిర్మాత ఇది తమ టైటిల్ అంటూ, ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ కూడా చేశామంటూ ముందుకు వచ్చి ఏకంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు. దీంతో రెండు సంస్థల మధ్య చర్చలు కూడా కొనసాగాయి. ఆ తర్వాత గప్ చుప్ అయిపోయారు. దీని గురించి మీడియా నానితో మాట్లాడించాలని ప్రయత్నించినా సమయం దొరకలేదు. అయితే "జెర్సీ" ప్రమోషన్‌లో మాట్లాడక తప్పలేదు. 
 
గ్యాంగ్ లీడర్ అంటే తనకు చాలా గౌరవమని తమ కథకు ఈ టైటిల్ తప్ప ఇంకేదీ యాప్ట్ కాదని సినిమా చూసాక మీరే ఒప్పుకుంటారని అలా కాదు అనిపిస్తే అప్పుడు చూద్దామని చెప్పాడు. ఇలా అనడంపై నాని ఉద్దేశం ఏమిటో అర్థం కాలేదు. అంటే ఇక్కడ నాని చెప్పింది ఇదివరకే రిజిస్టర్ చేసామని చెప్పిన వాళ్ళను వచ్చి సినిమా చూడమనా లేక రిలీజయ్యాక అభిమానులు చూసి అప్పుడు రియాక్ట్ అవమనా తెలియాలి. కానీ థియేటర్‌లో సినిమా విడుదలైన తర్వాత ఎవరూ చేసేదేమీ లేదు. బాగున్నా బాగలేకపోయినా సర్దుకుపోవాల్సిందే. దసరాకు టార్గెట్ చేసుకున్న జెర్సీ షూటింగ్‌లో నానీ బిజీ అయిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ విష‌యం గురించి నేను ఏం చెప్ప‌లేను... జెర్సీ హీరో నాని ఇంటర్వ్యూ