Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్పతో సుకుమార్ కాపీ డైరెక్టర్ గా మారిపోయాడా !

డీవీ
సోమవారం, 9 డిశెంబరు 2024 (09:36 IST)
Srihari- alluarjun, alikhan
అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప 2 సినిమా గురించి అందరికీ తెలిసిందే. పుష్ప ఎడమ భుజం వంగినట్లునడిచే విధానం,  గన్ పట్టుకునే విధానం అంతా పాత సినిమాల్లోని హీరోల పాత్రలను కాపీ కొట్టడాని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కథనాలు శ్రీహరి అభిమానులు చెబుతున్నారు. మొదటిది శ్రీహరి హీరో గా వచ్చిన పృద్వి నారాయణ చిత్రం. ఇందులో శ్రీహరి రెండు పాత్రలు పోషించాడు. ఒక పాత్ర విలనిజం వున్నది. దానినిని సుకుమార్ యాజ్ టీజ్ గా కాపీకొట్టేశాడు. శ్రీహరి సినిమా ప్రారంభోత్సవానికి అప్పుడు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు కూడా.
 
అదేవిధంగా భుజంపై ఫుష్ప గన్ పట్టుకునే విధానం కూడా తమిళ స్టార్ విజయకాంత్ హీరో గా వచ్చిన  కెప్టెన్ ప్రభాకర్ చిత్రంలోని స్టయిల్ ను దించేశాడు. ఈ సినిమాలో మన్సూర్ అలీఖాన్ నడవడిక ,ఆహార్యం పాత్ర తీరు తెన్నులు మొత్తం గా కాపీ చేసి పుష్ప రాజ్ పాత్ర గా మార్చాడు. కెప్టెన్ ప్రభాకర్ లో విలన్ పాత్రను పుష్ప లో హీరో పాత్రగా సుకుమార్ మార్చేశారు. 
 
ఇదంతా ఒక భాగమైతే మరో విశేషం పుష్ప సినిమా కథ గురించి మరో వార్త బయటకు వచ్చింది. పుష్ప మూవీ నార్ కోస్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ కథ తీసుకుని ఇండియన్ నేటివిటీగా సుకుమార్ మార్చేశాడట. సో. పెద్ద దర్శకులందరూ హాలీవుడ్ సినిమాలను కొరియన్ సినిమాలను కాపీ కొట్టేసి సక్సెస్ చేయాలని చూస్తున్నారనేది నిజమేనని తేలుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతి కార్యకర్తకి FB, YouTube, Twitter అన్న జగనన్న: అందుకే అవంతికి ఆగ్రహం, వైసిపి కుండకు చిల్లు

తిరుమలలో కుంభవృష్టి.. ఏరులై పారుతున్న వర్షపునీరు (Video)

ఏపీలో టెన్త్ - ఇంటర్ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే..?

400 బిలియన్ డాలర్ల క్లబ్‌లో ఎలాన్ మస్క్!!

Rajinikanth: సినిమాల్లో సూప‌ర్‌స్టారే... రాజ‌కీయాల్లో మాత్రం పేలని తుపాకీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

High blood pressure అధిక రక్తపోటు వున్నవారు ఏం తినకూడదు?

Fruits burn Belly fat, బెల్లీ ఫ్యాట్ కరిగించే పండ్లు, ఏంటవి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట తాగకల 5 పానీయాలు

Vitamin C Benefits: విటమిన్ సి వల్ల శరీరానికి 7 ఉపయోగాలు

winter health కండరాలు నొప్పులు, పట్టేయడం ఎందుకు?

తర్వాతి కథనం
Show comments