Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Allu Arjun Pushpa 2 History చరిత్ర సృష్టించిన 'పుష్ప-2' మూవీ.. వైల్డ్ ఫైర్ కాదు.. వరల్డ్ ఫైర్!!

Advertiesment
pushpa movie

ఠాగూర్

, శుక్రవారం, 6 డిశెంబరు 2024 (22:34 IST)
Allu Arjun Starrer Makes History  అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం "పుష్ప-2". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా ఆరు భాషల్లో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజునే చరిత్ర సృష్టించింది. తొలి రోజున ఏకంగా రూ.294 కోట్ల మేరకు కలెక్షన్లను రాబట్టింది. అలాగే, హిందీ సినిమా రికార్డులను కూడా ఓ చూపు చూసింది. ఫలితంగా 'పుష్ప వైల్డ్ ఫైర్ కాదనీ.. వరల్డ్ ఫైర్' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి. 
 
నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసిన ప్రకటన మేరకు.. 'పుష్ప-2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.294 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు పేర్కొంది. భారత సినీ చరిత్రలో ఇంత వరకు ఏ సినిమాకూ ఈ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు రాలేదు. 2022లో రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ "ఆర్ఆర్ఆర్" సినిమా కూడా తొలి రోజున రూ.233కోట్లు వసూలు చేయగా, ఆ రికార్డును ఇపుడు 'పుష్ప-2' అధికమించింది. 
 
ఇక హిందీ విషయానికి వస్తే అక్కడ కూడా రూ.72 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా సరికొత్త రికార్డును సెట్ చేసింది. ఇప్పటివరకు ఏ హిందీ చిత్రం కూడా మొదటిరోజు ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రం హిందీ వెర్షన్ తొలి రోజున రూ.65.5 కోట్లు రాబట్టగా, ఇపుడు 'పుష్ప' దెబ్బకు రెండో స్థానానికి 'జవాన్' పడిపోయింది. అలాగే, తెలంగాణాలోని నైజాం ఏరియాలో తొలి రోజున రూ.30 కోట్లు వసూలు చేయగా, దాంతో నైజాలో 'ఆర్ఆర్ఆర్' సాధించిన రూ.23కోట్ల రికార్డు కనుమరుగైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ ఏమన్నారు (Video)