Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ ఏమన్నారు (Video)

Advertiesment
allu arjun

ఠాగూర్

, శుక్రవారం, 6 డిశెంబరు 2024 (22:10 IST)
Allu Arjun First Reaction On Revathi Incident | Sandhya Theater Incident  'పుష్ప-2' చిత్రం చూడటానికి వచ్చి అశువులు బాసిన రేవతి అనే మహిళ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆ చిత్ర హీరో అల్లు అర్జున్ ముందుకు వచ్చారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఇందులోభాగంగా, రూ.25 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు అల్లు అర్జున్ ఓ వీడియోను విడుదల చేశారు. అలాగే, అస్వస్థతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడ్ శ్రీతేజ్ వైద్య ఖర్చులను కూడా భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. 
 
"మేం పుష్ప-2 ప్రీమియర్ షోకి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్‌కు వెళ్లాం. అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొందరికి దెబ్బలు తగిలాయని తెలిసింది. ఇద్దరు పిల్లలు తల్లి రేవతి గారు చనిపోయారని తెలియగానే చిత్ర బృందమంతా షాక్‌కు గురయ్యాం. థియేటర్‌కు వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూడటం అనేది గత 20 యేళ్ళుగా నాకు ఆనవాయితీగా వస్తుంది. ప్రేక్షకులకు వినోదం పవంచే థియేటర్ వద్ద అలా జరగడం బాధగా ఉంది. రేవతి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఎంత చేసినా ఆమె లేని లోటును తీర్చలేనిది. 
 
నా తరపున రూ.25 లక్షలు సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఈ అనూహ్యమైన కష్ట సమయంలో దుఃఖిస్తున్న కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధలో వారు ఒంటరిగా లేరని, కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తామని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ సవాలుతో కూడిన ప్రయాణంలో వారికి సహాయపడటానికి సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించడానికి నేను కట్టుబడి ఉన్నాను అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన.. మహిళ కుటుంబానికి రూ.25లక్షలు (video)