Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pushpa 2 box office Day 1 "పుష్ప-2" చిత్రం తొలి రోజు కలెక్షన్లు ఎంత?

Advertiesment
Pushpa2 poster

ఠాగూర్

, శుక్రవారం, 6 డిశెంబరు 2024 (09:14 IST)
Pushpa 2 box office Day 1 అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప-3 చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో అన్ని భాషల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి రోజున ఎంత మేరకు కలెక్షన్లు రాబట్టిందన్న చర్చ సినీ అభిమానుల్లో సాగుతుంది. సినిమా ట్రేడ్ వర్గాల గణాంకాల మేరకు పుష్ప-2 చిత్రం తొలి రోజున దాదాపు రూ.175 కోట్ల మేరకు వసూలు చేసినట్టు సమాచారం. ఒక్క అమెరికాలోనే రూ.35 కోట్ల మేరకు కొల్లగొట్టిందని తెలుస్తుంది. ఈక్రమంలో బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ నటించి 'జవాన్' చిత్రం కలెక్షన్లను అధికమించిందనే ప్రచారం సాగుది. 
 
ఈ చిత్రంలో హీరో అల్లు అర్జున్ వన్‌మ్యాన్ షోతో మరోసారి మెస్మరైజ్ చేశారు. సుక్కు టేకింగ్ ప్రేక్షకులను మైమరిపించింది. ఇక ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే దూసుకెళ్లిన ఈ చిత్రం మొదటి రోజు వసూళ్లలోనూ హవా చూపించినట్లు సమాచారం. బుధవారం రాత్రి నుంచి థియేటర్లలో సందడి చేసిన 'పుష్ప-2' ఓవర్సీస్‌లోనూ కలెక్షన్ల పరంగా అగ్రస్థానంలో నిలిచినట్టు సమాచారం. 
 
మొత్తంగా ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.175 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో ఏపీ, తెలంగాణ వాటా అధికంగా ఉన్నట్లు సమాచారం. కాగా, అమెరికాలో 'పుష్ప-2' మొదటి రోజు దాదాపు 4.2 మిలియన్ డాలర్లు (రూ.35కోట్లు) కొల్లగొట్టినట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్ విడుదల చేసింది. అగ్రరాజ్యంలో ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా 'పుష్ప-2' నిలిచిందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోగ్యం బాగాలేక మోక్షజ్ఞ చిత్రం వాయిదాపడింది : హీరో బాలకృష్ణ