Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెలవెలబోతున్న థియేటర్లు... దిగొచ్చిన 'పుష్ప-2' టికెట్ ధరలు

Advertiesment
Allu arjun

ఠాగూర్

, సోమవారం, 9 డిశెంబరు 2024 (09:14 IST)
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప-2 చిత్రం ఈ నెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా టిక్కెట్లను అమాంతం పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. దీంతో ఇష్టానుసారంగా టిక్కెట్ ధరలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి టిక్కెట్ ధరలు తగ్గించారు. దీనికి కారణం ప్రేక్షకులే. 
 
ఈ చిత్రం విడుదల సందర్భంగా రిలీజ్ తేదీ నుంచి ఏకంగా 18 రోజుల పాటు రకరకాల టికెట్ రేట్లతో పెంపునకు అనుమతులు తెచ్చుకున్న మేకర్స్.. తొలి వారాంతంలో చాలా థియేటర్స్‌లో ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. తమ సినిమాకు రూ.వందల కోట్లు వసూళ్లు వచ్చేశాయని నిర్మాతలు  చెప్పుకుంటున్నా.. వాస్తవ రూపంలో మాత్రం ఆ చిత్రానికి అంత సీన్ లేదని ప్రేక్షకులు కామెంట్స్ వ్యక్తం చేశారు. దీంతో ఐదో రోజుకే టికెట్ ధరలు తగ్గించేసిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి హైబ్ అనేది కొంతమేరె ఉండాలని.. హైప్ ఉంది కదా అని ఇష్టారీతిన పెంచితే.. ప్రేక్షకుల చాచి కొడతారని పుష్ప 2 మేకర్స్‌కు బాగా అర్థమయ్యే ఉంటుంది‌. 
 
డిసెంబరు 4న స్పెషల్ ప్రీమియర్‌కు అదనంగా రూ.800 ధర నిర్ణయించడంతో టికెట్ ధర ఏకంగా వెయ్యి రూపాయలు దాటేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో తేదీల వారీగా శ్లాబ్‌ సిస్టమ్ తరహాలో టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఆదివారం వరకూ సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్స్‌లో రూ.200 పెంచారు. దీంతో మల్టీప్లెక్స్‌లో 'పుష్ప' చూడాలంటే, రూ.500 పైనే చెల్లించాల్సి వచ్చేది. ఇక సింగిల్ స్క్రీన్‌లో రూ.300పైనే ఉంది.
 
టికెట్ ధరలు తగ్గితే సినిమా చూద్దామని ఆశగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఒకరకంగా ఇది శుభవార్తే. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, నైజాంలో పెంచిన ధరతో పోలిస్తే టికెట్ ధరలు ఇంకాస్త తగ్గినట్లు బుక్‌మై షోలో చూపిస్తోంది. సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.200 (జీఎస్టీ అదనం) ఉండగా, మల్టీప్లెక్స్‌లో రూ.395గా ఉంది. (జీఎస్టీ అదనం) అంటే సింగిల్ స్క్రీన్‌లో అనుమతి తీసుకున్న మేరకు టికెట్ ధరను పెంచలేదు. మల్టీప్లెక్స్‌లోనూ ఆ మేరకు ధరను తగ్గించారు. 
 
అలాగే విజయవాడలోనూ మల్టీప్లెక్స్‌లో రూ.300 ఉండగా, సింగిల్ స్క్రీన్‌లో రూ.220 మాత్రమే ఉంది. వైజాగ్ సింగిల్ స్క్రీన్‌లో రూ.295 ఉండగా, మల్టీప్లెక్స్‌లో రూ.300-977 వరకూ ఉన్నట్లు బుక్ మై షోలో చూపిస్తోంది. 
 
మరోవైపు కలెక్షన్ల పరంగా 'పుష్ప2 'రికార్డు సృష్టిస్తోంది. నార్త్ హిందీ సినిమాలకు దీటుగా వసూళ్లు రాబడుతోంది. ఇప్పటివరకూ ఏ హిందీ మూవీ సాధించని విధంగా ఒకరోజులో రూ.85 కోట్లు వసూలు చేసిన మూవీగా రికార్డు సృష్టించింది. నార్త్‌లో ఈ స్థాయి వసూళ్లు ఉంటే, నార్త్ అమెరికాలో ఏకంగా 8.03 మిలియన్ డాలర్లు రాబట్టడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా టెక్సాస్ లో బాలక్రిష్ణ డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ కు ఏర్పాట్లు