Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌కృష్ణ‌ అన్ స్టాప‌బుల్ కు మెగాస్టార్ ఎందుకు రాలేదో తెలుసా!

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (17:33 IST)
Chiru-balayya
నంద‌మూరి బాలకృష్ణ హోస్ట్‌గా  ఆహా ఓటీటీలో ట్రెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ కూడా ఊహించ‌ని విధంగా ఆద‌ర‌ణ పొందిన ఈ కార్య‌క్ర‌మానికి స్క్రిప్ట్ చాలా కీలకం. బాల‌య్య‌బాబు జోష్‌లా డైలాగ్‌లు చెప్పిస్తూ ఎదుటివారిని లాక్ చేసేలా డైలాగ్స్‌లు రాసిన బి.వి.ఎస్‌.ర‌వి. ప‌లువురు సీనియ‌ర్ ద‌ర్శ‌కుల సినిమాల‌కు ప‌నిచేసిన ఆయ‌న ఓ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించాడు. ఇప్పుడు ఈ అన్ స్టాప‌బుల్ కార్య‌క్ర‌మం ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన మ‌హేష్‌బాబుతో వ‌చ్చే ఎపిసోడ్‌తో ముగియ‌నున్న‌ది. ముందుగా అనుకున్న ప్ర‌కారం ఈ సిరీస్ ముగుస్తుంద‌ని ఓటీటీ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి.
 
అయితే ముందునుంచి బాల‌య్య‌బాబు, మెగాస్టార్ చిరంజీవిని కూడా ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నార‌ని టాక్ వ‌చ్చింది. ఇద్ద‌రూ వుంటే టాక్ షోకు మ‌రింత హైప్ వ‌చ్చేద‌ని వ్యాపార వ‌ర్గాలు కూడా తెలియ‌జేశాయి. ఇద్ద‌రినీ క‌లిపితే తాము ముందుంటామని ఓ ప్ర‌ముఖ వ్యాపార‌సంస్థ ముందుకు వ‌చ్చింది. కానీ బాల‌కృష్ణ హోస్ట్‌గా వున్న దీనికి చిరంజీవి రాలేదు. ఆహా అంటేనే అల్లు అర‌వింద్ అనుకుంటారు. కానీ ఆయ‌న ఓ పార్ట‌న‌ర్ మాత్ర‌మే. దీని వెనుక ప్ర‌ముఖ రాజ‌కీయ‌పార్టీకి చెందిన వ్యాపార‌వేత్త వున్నారుకూడా. అయితే ఇప్పుడు తాజా స‌మాచారం ప్ర‌కారం  అన్ స్టాప‌బుల్ సెకండ్  సీజ‌న్‌కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా రానున్నాడ‌ని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్ కూడా ఓటీటీ సంస్థ సిద్ధం చేస్తుంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. సో. అందుకే.. చిరంజీవి, బాల‌య్య కాంబినేష‌న్ మొద‌టి సీజ‌న్ కు రాలేదు. మ‌రి భ‌విష్య‌త్‌లో చిరంజీవి హోస్ట్‌గా వున్న‌ప్పుడు బాల‌య్య‌బాబు కూడా వ‌స్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments