Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ విజయంఎన్.టి.ఆర్ గారికి అంకితం

ఈ  విజయంఎన్.టి.ఆర్ గారికి అంకితం
, శుక్రవారం, 21 జనవరి 2022 (07:51 IST)
Akhanda 50 Days Celebration
గురువారం రాత్రి అఖండ 50డేస్ వేడుక‌లో దర్శకుడు బోయపాటి శ్రీను, జై బాలయ్య అంటూ అభిమానులను హుషారెత్తిస్తూ మాట్లాడారు. సోదర సమానులైన నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో అలాగే అభిమానుల అండతో తెలుగు ప్రేక్షకుల అండదండలతో బాలయ్యబాబు నా మీద పెట్టుకున్న నమ్మకంతో ఈ సినిమాకు సహకరించిన నిర్మాతలకూ అఖండ విజయం సాధించి పెట్టింది. దాదాపు వందకుపైగా థియేటర్లలో ఆడుతోంది. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. ఈ విజయం  నందమూరి అబిమానులది. తెలుగు ప్రేక్షకులది. తెలుగు పరిశ్రమ ది. ఈ విజయాన్ని ఎన్.టి.ఆర్.గారికి అంకితమిస్తున్నాం. బాల‌య్య‌బాబు, మా కాంబినేషన్ ఎప్పడు తీసినా మీ ఆదరాభిమానాలు వుండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
 
నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, నందమూరి కుటుంబానికి, ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ, మీ అభిమానాన్ని యాభైరోజులు ఏకధాటిగా చూపించారు. అందుకే కృతజ్ఞతలు తెలిపేందుకు మీ ముందుకు వచ్చాం. మనం ఏదైనా కల కంటే అది నిజమైతే ఆనందంగా వుంటుంది. నిజాయితీగా చెబుతున్నా... ఇలా అఖండ సినిమా విడుదల అవుతుందనీ, యాభై రోజులు అడుతుందనీ, ఇంకా థియేటర్లలో కొనసాగుతుందనీ కానీ నేను కానీ, ఎవరూ కానీ కల కనలేదు. ఆ కలను నిజంచేసిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముందుముందు ఇలాగే మీ అభిమానం వుండాలంటూ జై బాలయ్య అంటూ ముగించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నైజాం పంపిణీదారుడు శిరీష్ రెడ్డి, సుదర్శన్ థియేటర్ అధినేత బాల గోవిందరాజు, మేనేజర్ బాలు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోయపాటి శ్రీను గురించి నందమూరి బాలకృష్ణ షాకింక్ కామెంట్‌!