Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నుదుటున కుంకుమ బొట్లు పెట్టుకుని దేవుడి పటాలు బోర్లించి టెక్కీ కుటుంబం సూసైడ్

Advertiesment
Techie fmily suicide
చక్కటి కుటుంబం, ఆర్థికంగా ఇబ్బందులేమీ లేవు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పదేళ్లక్రితం పెద్దలు అనుమతి తీసుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఏడేళ్ల కుమార్తె కూడా వుంది. కానీ ఏమైందో తెలియదు కానీ ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాదులోని అమీన్‌పూర్ వందనపురి కాలనీలో 42 ఏళ్ల శ్రీకాంత్ గౌడ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి 40 ఏళ్ల భార్య అనామిక కూడా ఓ కార్పొరేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఐతే రెండు రోజులుగా వీరు బయట కనిపించలేదు.

 
మరోవైపు అనామిక తండ్రి ఫోన్ చేసినా స్పందన లేదు. దీనితో అనుమానం వచ్చిన అనామిక తండ్రి నేరుగా వారి ఇంటికి వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించగా లోపల గడియపెట్టి వుంది. దీనితో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా అనామిక, ఆమె కుమార్తె ఇద్దరూ మంచంపై పడి నురగలు కక్కి మరణించి వున్నారు. 

 
శ్రీకాంత్ గౌడ్ తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. మృతదేహాలను పరిశీలించగా వారి నుదుటున కుంకుమ బొట్లు పెట్టుకుని వున్నారు. దేవుడి పటాలను బోర్లించి పెట్టారు. దీనితో వారి మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా విజృంభణ : ఏపీలో 12,338 - తెలంగాణాలో 4,207 కేసులు