Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోయపాటి శ్రీను గురించి నందమూరి బాలకృష్ణ షాకింక్ కామెంట్‌!

Advertiesment
బోయపాటి శ్రీను గురించి  నందమూరి బాలకృష్ణ షాకింక్ కామెంట్‌!
, శుక్రవారం, 21 జనవరి 2022 (07:42 IST)
balakrishna- boyapati
ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను గురించి  నందమూరి బాలకృష్ణ షాకింక్ కామెంట్ చేశాడు. శివుడి శ్లోకాలు ప‌ల్లిస్తూ, ష‌డెన్‌గా పుట్టుక‌ గురించి చెప్పేస‌రికి ఒక్క‌సారిగా అభిమానులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. వివ‌రాల్లోకి వెళితే,  అభిమానుల కేరింతలు, ఆనందోత్సాహాలమధ్య నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం అర్థ శతదినోత్సవ వేడుక జరిగింది. గురువారంనాడు రాత్రి హైదరాబాద్లోని ఆర్.టి.సి. క్రాస్రోడ్లో గల సుదర్శన్ 35.ఎం.ఎం. థియేటర్ ఇందుకు వేదికైంది. ప్రేక్షకులు అఖండ సినిమా చూస్తుండగానే  బాలకృష్ణ  విచ్చేసి అభిమానులను అలరించారు. వారి ఆనందానికి అవధులు లేవు.
 
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ,  మా టీమ్ సమిష్టి కృషి. శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తుచేసుంటూ వాటిని పోషించాను. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు అఖండ పండుగ ఇది. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు. ఇది ఆంధ్ర, తెలంగాణేకాదు, కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా అలాగే యావత్ ప్రపంచ పండుగ అఖండ అర్థ శతదినోత్సవం. ఈ వేడుకను పలుచోట్ల అభిమానులు జరుపుకుంటున్నారు. అందుకు గర్వంగా వుంది. ఈ సినిమా విజయాన్ని చేసేలా సహకరించిన ఆది దంపతులకు కృతజ్ఞతలు. ఇక బోయపాటి శ్రీను, నా కాంబినేషన్ హాట్రిక్. మా కలయిక జన్మజన్మలది. అందుకే ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు. అన్నారు. వెంట‌నే అభిమానులు కోలాహ‌లంగా జై బాల‌య్య అంటూ నినాదాలు చేశారు. 
ఇక వారి అభిమానం గురించి కూడా ఇలా మాట్లాడారు.
మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. నాకు నాన్నగారు ఆదర్శం. ఈఅఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మమ్ముట్టి కుమారుడు దుల్కర్‌కు కరోనా పాజిటివ్