Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్ర‌గ్యా జైస్వాల్ క‌ల‌ల క‌థానాయ‌కుడు ఎవ‌రో తెలుసా!

Advertiesment
ప్ర‌గ్యా జైస్వాల్ క‌ల‌ల క‌థానాయ‌కుడు ఎవ‌రో తెలుసా!
, మంగళవారం, 25 జనవరి 2022 (16:59 IST)
Pragya Jaiswal, Salman Khan
`కంచె` సినిమా హీరోయిన్ ప్ర‌గ్యాజైస్వాల్‌కి సౌత్‌లో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలేవీ అక్క‌ర్లేదు. రీసెంట్‌గా అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ కావ‌డంతో ప్ర‌గ్యా జోరు మ‌రో రేంజ్‌లో ఉంది. 50 రోజులు పూర్తి చేసుకుని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న ప్ర‌గ్యా న‌టించిన అఖండ సినిమా జోరుతో నార్త్ లోనూ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది ప్ర‌గ్యా జైస్వాల్‌. సల్మాన్ ఖాన్ స‌ర‌స‌న మెయిన్ ఛాలా అంటూ ఆడిపాడి హిందీ డెబ్యూ ఇచ్చేశారు ప్ర‌గ్యా. ఈ పాట‌లో స‌ల్మాన్‌, ప్ర‌గ్యా మ‌ధ్య కెమిస్ట్రీ అద్దిరిపోయింద‌ని అంటున్నారు ఆడియ‌న్స్. రీసెంట్ టైమ్స్ లో రిలీజైన సింగిల్స్ లో మెయిన్ ఛాలాకు మంచి స్పంద‌న వ‌స్తోంది. 
 
ఈ పాట గురించి ప్ర‌గ్యా మాట్లాడుతూ ``స‌ల్మాన్ ఖాన్ సార్‌తో ప‌నిచేయాల‌ని ప్ర‌తి ఆర్టిస్టుకీ ఒక క‌ల ఉంటుంది. నేను ఈ రంగంలో అడుగుపెట్టిన‌ప్పుడు క‌న్న క‌ల ఇప్పుడు నిజ‌మైంది. హిందీలో నా తొలి ప్రాజెక్టుతోనే ఆయ‌నతో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. స‌ల్మాన్‌సార్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు గ‌ర్వంగా ఉంది. నిజానికి ఆయ‌న‌తో రొమాంటిక్ పాట‌లో స్టెప్పులేసింది నేనేనా అని ఒక‌సారి గిల్లి చూసుకున్నాను (న‌వ్వుతూ). మెయిన్ ఛాలా బ్యూటీఫుల్ సాంగ్‌. గురు రంధ్వ‌, లులియా వంతూర్ ఈ రొమాంటిక్ మెలోడీని అద్భుతంగా ఆల‌పించారు. ఈ పాట‌ను చూసిన‌, విన్న ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చి తీరుతుంద‌నే న‌మ్మ‌కం నాకుంది`` అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24న 'భీమ్లా నాయక్' ప్రీమియర్ షోలు - టిక్కెట్ ధర ఎంతంటే...