Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజ దర్శకత్వంలో ఉదయ్‌కిరణ్‌ బయోపిక్‌? పేరు 'కాబోయిన అల్లుడు'

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ భారీ ప్రాజెక్టు నుంచి దర్శకుడు తేజ తప్పుకున్నారు. ఆయన నిర్ణయం టాలీవుడ్‌లో ఓ సంచలనంగా మారింది.

Webdunia
గురువారం, 17 మే 2018 (15:06 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ భారీ ప్రాజెక్టు నుంచి దర్శకుడు తేజ తప్పుకున్నారు. ఆయన నిర్ణయం టాలీవుడ్‌లో ఓ సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తేజ మళ్లీ మరో బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఆ కథ ఎవరిదో కాదు.. తెలుగు చిత్రసీమలో ఓ వెలుగు వెలిగి అనంతలోకాలకు చేరుకున్న యువ హీరో ఉదయ్ కిరణ్‌ది. ఉదయ్ కిరణ్ హీరోగా తేజ బయోపిక్‌ను నిర్మించనున్నారు.
 
నిజానికి 'చిత్రం'తో సినిమాతో ఉదయ్‌ కిరణ్‌ని హీరోగా పరిచయం చేసిందీ... 'నువ్వు నేను'తో అతడికి హీరోగా స్టార్‌డమ్‌ తెచ్చిందీ... 'ఔనన్నా కాదన్నా'తో అతడు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చిన ఏకైక దర్శకుడు తేజ మాత్రమే. అంటే ఉదయ్‌కిరణ్‌ నట జీవితంలో ఆయనది అత్యంత కీలక పాత్ర. అతడి జీవితంలో మంచీచెడులు, ఎత్తుపల్లాలు, జయాపజయాలను తేజ దగ్గరనుంచి చూశారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకని, అతడి జీవితాన్ని వెండితెర మీదకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఉదయ్‌కిరణ్‌ బయోపిక్‌ కథాచర్చల్లో ఆయన నిమగ్నమైవున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ బయోపిక్‌కి తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌లో 'కాబోయిన అల్లుడు' అనే టైటిల్‌ రిజిస్టర్‌ చేశారు. కాగా, ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సినీ కుటుంబంతో ఉదయ్‌కిరణ్‌ కుటుంబం వియ్యానికి సిద్ధమవడం, ప్రముఖ హీరోకి అల్లుడు కాబోయి వివాదాల కారణంగా ఆ పెళ్లి రద్దు కావడంతో ఉదయ్‌కిరణ్‌ డిప్రెషన్‌లోకి వెళ్లాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments