Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఉంటూనే రూ.లక్షల్లో సంపాదిస్తున్న ఆ ఇద్దరు తారలు? ఎలా?

Webdunia
మంగళవారం, 19 మే 2020 (15:35 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇది ఈ నెలాఖరు ఉంటుంది. ఈ లాక్డౌన్ కారణంగా సినీ షూటింగులన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినీ ఇండస్ట్రీకి చెందిన 24 కళలకు చెందిన వారు తమతమ ఇళ్ళకే పరిమితమైవున్నారు. అయితే, హీరోయిన్లు మాత్రం తమతమ గృహాల్లోనే ఉంటూనే రూ.లక్షల్లో సంపాదిస్తున్నట్టు ఓ వార్త ఇపుడు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా, టాలీవుడ్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాలు ఈ కోవలో ముందువరుసలో ఉన్నట్టు సమాచారం. అసలు లాక్డౌన్ వెళ వీరిద్దరు మాత్రం ఎలా రూ.లక్షల్లో సంపాదిస్తున్నారన్నదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
ప్రతి ఒక్క హీరోయిన్‌కు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వుంది. అలాగే, లక్షల్లో ఫాలోయర్లు కూడా ఉన్నారు. ఇదే వారికి ఓ మంచి అవకాశంగా మారింది. ఉదాహరణకు కాజల్ అగర్వాల్‌కు 14.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే, తమన్నాకు 10.5 మిలియన్ల మంది ఉన్నారు. దీంతో ఈ లాక్డౌన్ సమయంలో తమ ఖాతాల ద్వారా ప్రమోషనల్ పోస్టింగులను పెడుతూ వీరు లక్షలాది రూపాయలను సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
మామూలుగా సినిమా తారలకున్న ఆదరణను బట్టి ఒక్కో పోస్టింగుకి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆయా సంస్థలు చెల్లిస్తుంటాయి. ఈ క్రమంలో కాజల్, తమన్నాలకు ఒక్కో పోస్టింగుకి సుమారు రూ.5 లక్షలు వస్తున్నట్టు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఇంట్లోనే ఖాళీగా వుండి కూడా ఈ ముద్దుగుమ్మలు లక్షల్లో సంపాదిస్తున్నారన్న మాట. చూశారా.. తాము సంపాదించుకున్న గ్లామరు, ఇమేజు వీళ్లకు ఎలా ఉపయోగపడుతోందో! అదండీ వెండితెర వైభోగం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments