Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆచార్య కోసం రంగమ్మత్త స్పెషల్ సాంగ్..(video)

Advertiesment
Rangamatha
రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ.. ప్రస్తుతం మెగాస్టార్ కోసం కొత్త అవతారం ఎత్తనుంది. స్పెషల్ సాంగ్‌లో చిందేసేందుకు రంగమ్మత్త సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా రూపొందుతోంది. 
 
చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లినా కరోనాతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇందులో మెగాస్టార్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
 
ఇదే సినిమాలోచిరంజీవి - రెజీనా కాంబినేషన్లో ఒక ఐటమ్ సాంగు కూడా వుంది. ఇటీవలే ఈ పాటను 6 రోజుల పాటు చిత్రీకరించారు. సినిమాలో ఈ పాట ఇంటర్వెల్‌కి ముందు వస్తుందని సమాచారం. ఇంటర్వెల్ తరువాత కూడా ఒక ప్రత్యేక సాంగ్‌‌ను కొరటాల ప్లాన్ చేశారట.
 
ఈ స్పెషల్ సాంగు కోసం అనసూయను తీసుకున్నట్టుగా సమాచారం. అనసూయ హాట్ హాట్‌గా కనిపిస్తూ చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయనుందని ఫిల్ అంటున్నారు. ఈ స్పెషల్ పాట కోసం ఆమెకి భారీ పారితోషికమే ముట్టినట్టుగా చెప్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ఆర్ఆర్‌లో విజయ్ నటిస్తున్నాడా?