రామ్ చరణ్‌కు జోడీగా రష్మిక..?

సోమవారం, 23 మార్చి 2020 (17:19 IST)
రామ్ చరణ్‌కు జోడీగా రష్మిక ఎంపికైనట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తాజా చిత్రం రూపొందుతోంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, చరణ్ సరసన రష్మికను తీసుకున్నట్లు తెలిసింది. ఇంకా చెర్రీకి జోడీగా ఇప్పటికే సమంత, కైరా అద్వానీలు నటిస్తున్నట్లు టాక్ వచ్చింది. 
 
కానీ ప్రస్తుతం రష్మిక పేరు తెరపైకి వచ్చింది. ఒక వైపున సుకుమార్ సినిమాలో బన్నీ సరసన నటించడానికి రష్మిక సెట్స్ పైకి వెళ్లనుంది. మరో వైపున చరణ్ జోడీగా అలరించడానికి కూడా ఆమె సిద్ధమవుతోందని తెలిసిందే. మెగా హీరోలిద్దరి సినిమాల్లోను ఒకేసారి ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ సంతోషానికి అవధుల్లేవు.
 
ఛలో వంటి హిట్ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ రష్మికా మందన్న గీతగోవిందం సినిమాతో టాప్ హీరోయిన్ అయిపోయింది. ఏకంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమాలో అవకాశం దక్కించుకుంది. మహేష్ సరసన రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరు ఇటీవల సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చరణ్‌, కొరటాల మధ్య గొడవ జరిగిందా? అందుకే సినిమా చేయడం లేదా?