#ClapForRespect జాతి మొత్తం చప్పట్లతో సలాం కొట్టింది..

ఆదివారం, 22 మార్చి 2020 (17:47 IST)
మార్చి 22వ తేదీ జాతి మొత్తం జనతా కర్ఫ్యూ పాటించింది. అలాగే ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశ వ్యాప్తంగా ప్రజలు తమ బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టి వైద్య, సహాయక సిబ్బందికి.. కరోనాతో పోరాడి చనిపోయిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. వైద్యులారా మీ సేవలకు శతకోటి వందనాలు అంటూ.. జాతి మొత్తం చప్పట్లతో సలాం కొడుతోంది. 
 
జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు బాల్కనీలోకి వచ్చి అందరూ వైద్యులకు చప్పట్ల ద్వారా సెల్యూట్ చేశారు. ప్రజలు, సెలబ్రిటీలు క్లాప్స్ ద్వారా వైద్యులకు సలాం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా క్లాప్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం సాయంత్రం తమ నివాసంలో 5 గంటలకు “గంటా నాదం” ద్వారా కరోన బాధితులకు సేవలు చేస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, మీడియాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 
 
ఇంకా హర్భజన్ సింగ్ కుటుంబం, మంచు ఫ్యామిలీ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, రాష్ట్రపతి కోవింద్, బీజేపీ నేత నిర్మలా సీతారామన్, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, సురేష్ రైనా, ఆరోగ్య శాఖ అధికారులు, శరద్ పవార్, వివేక్ ఆనంద్ ఒబరాయ్, టాలీవుడ్ హీరో శ్రీకాంత్, బీజేపీ నేత కిషన్ రెడ్డి, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు కరతాళ ధ్వనులతో వైద్య సిబ్బందికి సలాం చెప్పారు. ప్రముఖులు క్లాప్ల్ చేసే వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. #ClapForRespect అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జనతా కర్ఫ్యూ మద్దతుపై ప్రధాని హర్షం.. 75 జిల్లాల్లో లాక్ డౌన్