Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాప్ డైరెక్టర్స్‌తో చిరు అల్లుడు

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (19:55 IST)
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ చేస్తున్న మూవీ సూపర్ మచ్చీ. ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే రెండు మూడు సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు. తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పాడు.
 
అది ఎవరితో అంటారా..? నాగశౌర్యతో అశ్వద్ధామ సినిమా తెరకెక్కించిన రమణ తేజతో అని సమాచారం. ఈరోజే అగ్రిమెంట్లు పూర్త‌య్యాయి. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు‌. అయితే.. చిరు చిన్నల్లుడు విషయంలో అందరిలో ఓ డౌట్ ఉంది.
 
 అది ఏంటంటే... విజేత సినిమా చేసాడు. అది ఆడలేదు. రెండో సినిమా సూపర్ మచ్చి. ఇదేం క్రేజీ ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు అశ్వద్ధామ దర్శకుడుతో ప్రాజెక్ట్ ఓకే అయ్యింది.
 
అశ్వద్ధామ ఆశించిన స్ధాయిలో ఆడలేదు. అందుచేత ఇది కూడా పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ కాదు. చిరు మేనల్లుడు ఇలాంటి ప్రాజెక్టులు ఓకే చేస్తున్నాడు ఏంటి..? ఏ హీరో అయినా సక్సస్‌ఫుల్ డైరెక్టర్ వెంటపడతారు.. మరి కళ్యాణ్ దేవ్ ఏంటి ప్లాపు డైరెక్టర్స్ వెంట పడుతున్నాడు..? అంటున్నారు. అంటే కళ్యాణ్ దేవ్ మామ చిరు సలహాలు తీసుకోవడం లేదా..? 
 
చిరు కూడా అల్లుడు విషయంలో అంతగా పట్టించుకోవడం లేదా..? అనే అనుమానాలు వస్తున్నాయి. మరి.. కళ్యాణ్ దేవ్ ఎప్పుడు తెలుసుకుంటాడో..? ఎప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments