ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఖైదీ చిత్రంలో ఎలా వున్నారో ఇప్పటికీ అలాంటి చరిష్మాతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు చిరంజీవి. ఆయన కెరీర్లో దర్శకుడు విజయ బాపినీడుతో చేసిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ కలెక్షన్లు వసూలు చేశాయి.
అందులో గ్యాంగ్ లీడర్ చిత్రం ఒకటి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆజ్ కా గూండారాజ్ అని రీమేక్ చేశారు. ఆయన దర్శకత్వంలో బిగ్ బాస్, ఖైదీ నెం. 786, మగధీరుడు చిత్రాలు వచ్చాయి. ఇవన్నీ గ్రేట్ సక్సెస్ సాధించాయి. ఇకపోతే చిరంజీవి హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో మెగాస్టార్ లుక్ అదిరిపోతుంది.
మెగాస్టార్ చిరంజీవి ఈ 2020వ సంవత్సరంతో 65 ఏళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పేద్దాం.