Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి జెనీలియా భర్త.. కాంగ్రెస్ సీటుపై లతూర్ నుంచి పోటీ?

బాలీవుడ్ సినీ నటుడు, సినీ నటి జెనీలియా భర్త రితీష్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలోని లాతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రితీష్ సన్నాహాలు చే

Webdunia
గురువారం, 12 జులై 2018 (11:18 IST)
బాలీవుడ్ సినీ నటుడు, సినీ నటి జెనీలియా భర్త రితీష్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలోని లాతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రితీష్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్‌ముఖ్ కుమారుడే రితీష్ దేశ్ ముఖ్ అన్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో తండ్రి వారసత్వం పుచ్చుకుని రాజకీయ తెరంగేట్రం చేసేందుకు రితీష్ సిద్ధంగా వున్నాడని తెలుస్తోంది. అయితే తన రాజకీయ అరంగేట్రంపై రితీష్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి ''హౌస్ ఫుల్ 4'' సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ఢమాల్ సినిమాలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, అజయ్ దేవగన్‌లతో కలిసి రితీష్ నటిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో రితీష్ చేరడం ద్వారా లతూర్ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల బరిలోకి దిగుతాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. రితీష్ నోరు విప్పాల్సిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments