Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రగిరి నుంచి నారా బ్రహ్మిణి పోటీ?

నారా కుటుంబం నుంచి నారా బ్రహ్మిణి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారా.. ఒకవైపు అత్త భువనేశ్వరి ఒత్తిడి, మరోవైపు భర్త లోకేష్‌ ప్రోత్సాహం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలన్న నిర్ణయానికి నారా బ్రహ్మిణి వచ్చేశారా? వచ్చే ఎన్నికల్లో బ్రహ్మిణి ఏ

చంద్రగిరి నుంచి నారా బ్రహ్మిణి పోటీ?
, మంగళవారం, 3 జులై 2018 (19:38 IST)
నారా కుటుంబం నుంచి నారా బ్రహ్మిణి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారా.. ఒకవైపు అత్త భువనేశ్వరి ఒత్తిడి, మరోవైపు భర్త లోకేష్‌ ప్రోత్సాహం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలన్న నిర్ణయానికి నారా బ్రహ్మిణి వచ్చేశారా? వచ్చే ఎన్నికల్లో బ్రహ్మిణి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. 
 
నారా బ్రహ్మిణి. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. నందమూరి బాలక్రిష్ణ, వసుంధరల ముద్దుల కుమార్తె నారా బ్రహ్మిణి. విదేశాల్లో చదువుకున్న నారా బ్రహ్మిణికి రాజకీయాల గురించి బాగానే తెలుసు. తండ్రితో పాటు భర్త కూడా రాజకీయాల్లోనే ఉండటంతో రాజకీయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తుండేది నారా బ్రహ్మిణి. కోడలు రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అత్త భువనేశ్వరి ఆశ. 
 
ఇప్పటికే తండ్రి, భర్త, మామ ఇలా అందరూ రాజకీయాల్లో ఉండటంతో బ్రహ్మిణి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. మామ చంద్రబాబుకు  చెందిన హెరిటేజ్ సంస్థ బాధ్యతలను చూస్తూ వస్తున్నారు. హెరిటేజ్ సంస్థ బాధ్యతలను బ్రహ్మిణి చేపట్టిన తరువాత లాభాలు కూడా బాగా పెరిగాయి. దీంతో మామ చంద్రబాబుకు కోడలిపై నమ్మకం పెరిగింది. 
 
అటు వ్యాపారంతో పాటు ఇటు రాజకీయంగా కూడా రాణించాలని అత్త భువనేశ్వరి బ్రహ్మిణిపై గత కొన్నిరోజులుగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తన భార్య రాజకీయాల్లోకి వస్తే సపోర్ట్ చేయడానికి లోకేష్‌ కూడా సిద్ధంగా ఉన్నారట. దీంతో భువనేశ్వరి తన కోడలు రాజకీయాల్లో కూడా రాణించాలని, అందుకు తగిన ప్రోత్సాహం అందించాలని చంద్రబాబును కోరారట. వచ్చే ఎన్నికల్లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయానికి కూడా నారా బ్రహ్మిణి వచ్చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఇన్‌ఛార్జ్‌గా వున్న గల్లా అరుణ కుమారి ఆ ప్రాంతం నుంచి తను పోటీ చేయనని ప్రకటించిన నేపథ్యంలో బ్రహ్మిణిని అక్కడి నుంచే పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోఠి ప్రభుత్వాసుపత్రిలో పసిపాప కిడ్నాప్- బీదర్‌లో దొరికింది