Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఎన్టీఆర్ ఎక్కడ? నానీ ఎక్కడ?'' అందుకే బాధపడలేదు: సంజన

నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ షోపై.. కామన్ మ్యాన్ కోటాలో హౌస్‌లోకి ప్రవేశించి, తొలివారంలోనే ఎలిమినేట్ అయిన సంజన సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షోకి నాని వ్యాఖ్యాత

Advertiesment
, మంగళవారం, 19 జూన్ 2018 (13:45 IST)
నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ షోపై.. కామన్ మ్యాన్ కోటాలో హౌస్‌లోకి ప్రవేశించి, తొలివారంలోనే ఎలిమినేట్ అయిన సంజన సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షోకి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించడం ద్వారా అంత క్రేజ్ లేదని టాక్ వస్తున్న నేపథ్యంలో.. బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా నాని వ్యవహరించడం తనకు నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో సంజన చెప్పింది. 
 
ఎన్టీఆర్ ఎక్కడ నాని ఎక్కడ అంటూ కామెంట్స్ చేసింది. ఎన్టీఆర్ ఫ్యాన్‌ని కావడంతో నాని నచ్చకపోయివుండవచ్చునని ఫ్రాంక్‌గా సంజన తెలిపింది. ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని చాలాబాగా నిర్వహించారని, తొలి సీజన్ అంత పెద్ద హిట్ కావడానికి ఎన్టీఆర్ కారణమని సంజన చెప్పింది. ఆ స్థాయిలో నాని పెర్ ఫార్మెన్స్ లేదని అభిప్రాయపడింది. "ఎన్టీఆర్ ఎక్కడ? నానీ ఎక్కడ?'' అందుకే తాను బయటకు వచ్చినా పెద్దగా బాధపడలేదని సంజన చెప్పుకొచ్చింది.
 
బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వెళ్లేది లేదని.. ఆ షో కోసం మరో అవకాశం వచ్చినా వెళ్లనని చెప్పింది. తాను ఎన్టీఆర్ అభిమానినని, నానీ సినిమాలను వ్యక్తిగతంగా ఇష్టపడతానని సంజన తెలిపింది. ఉదాహరణకు మహానటి సినిమా వుందనుకోండి.. తాను చిన్న మహానటి తీస్తే.. మహానటి సినిమా ఎక్కడ? ఇదెక్కడ? అని అడుగుతారు. అలాంటిదే బిగ్ బాస్ హోస్ట్ కూడానని సంజన వ్యాఖ్యానించింది. వారం రోజుల్లోపు తన గురించి ఏం తెలుసుకుని ఎలిమినేట్ చేస్తారని సంజన ప్రశ్నించింది. అలాగే కామన్ అమ్మాయి కాబట్టి తనను తీసేస్తే ఎవరు అడగరని సంజన తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. వేధించాడు.. ఆత్మహత్య చేసుకుంటున్నా: తేజస్విని