Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోర్టు ఆర్డర్‌తో రామమందిరం, బాబ్రీ మసీదుల్ని కూల్చలేదే.. యోగి ఏమన్నారంటే?

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ మందిర నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికలకు ముందే రామ మందిరాన్ని నిర్మిస్తామని తెలిపారు. సంత్ సమ్మేళన్ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్య

Advertiesment
కోర్టు ఆర్డర్‌తో రామమందిరం, బాబ్రీ మసీదుల్ని కూల్చలేదే.. యోగి ఏమన్నారంటే?
, మంగళవారం, 26 జూన్ 2018 (12:37 IST)
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ మందిర నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికలకు ముందే  రామ మందిరాన్ని నిర్మిస్తామని తెలిపారు. సంత్ సమ్మేళన్ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం ఉంచాలని, సహనంతో ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
ప్రపంచాన్ని నడిపిస్తున్నది రాముడేనని.. ఆయన అనుగ్రహంతో రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుందని యోగి వ్యాఖ్యానించారు. దేశంలో న్యాయ, చట్టసభల వ్యవస్థలు తమతమ పాత్రను పోషిస్తున్నాయని.. వాటి పరిధులను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. 
 
ఇప్పటికే రామ మందిరంపై మరో బీజేపీ నేత రామ్ విలాస్ వేదాంతి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆర్డరు తీసుకుని రామ మందిరాన్ని మొఘల్ చక్రవర్తి బాబర్ కూల్చలేదు. 1992లో బాబ్రీ మసీదును కోర్టు ఆర్డరుతో ధ్వంసం చేయలేదు. 
 
మందిరం ప్రాంతంలో ఉన్నట్టుండి రాముడి విగ్రహం ఏర్పాటయినట్టే.. మందిర నిర్మాణం కూడా ఏదో ఒక రోజు ఉన్నట్టుండి ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ కూడా రామ మందిరం ఉద్యమాన్ని తాము మరోసారి ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. 
 
రానున్న మూడు లేదా నాలుగు నెలల్లో రామ మందిర నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించకపోతే... మత పెద్దలతో కలసి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని వీహెచ్‌పీ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాదిని కుమ్మేస్తున్న వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ఎక్కడ?