ఉత్తరాదిని కుమ్మేస్తున్న వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ఎక్కడ?
ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రుతుపవనాల విస్తరణలో భాగంగా దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో స
ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రుతుపవనాల విస్తరణలో భాగంగా దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో సోమవారం రాత్రినుంచి కురుస్తున్న వాన బీభత్సం సృష్టించింది. వర్షాల కారణంగా నలుగురు మృతి చెందారు.
ముంబై, భువనేశ్వర్ తీరప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ముంబై, అహ్మదాబాద్ హైవే పైనా భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు, సరుకు రవాణాకు ఇబ్బంది ఏర్పడింది. భిలాద్, సంజన్ మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. కొన్ని రైల్వే సర్వీసులను దారిమళ్లించారు. వర్షాలు, వరదలతో కొన్ని ప్రాంతాలు నీటమునిగాయి.
ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ముంబై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లు, లోకల్ రైళ్లు చాలావరకు రద్దుచేశారు. రైలు పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. నగరంలో చాలా చోట్ల రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
వర్షప్రభావం ముంబైలోని అంధేరి, ఖర్ , మలద్ ప్రాంతాల్లో తీవ్రంగా కనిపించింది. రికార్డు స్థాయిలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా నగరానికి చెందిన రోడ్లనీ వర్షపునీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు కాస్త బలహీనపడ్డాయి.