Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంకొండ గణేష్‌తో భాగ్యశ్రీ కుమార్తె రొమాన్స్

Avantika Dassani
Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (10:28 IST)
Avantika Dassani
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ కుమార్తె  త్వరలో సినీ రంగ ప్రవేశం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. 1989లో సల్మాన్​ ఖాన్​ సరసన 'మైనే ప్యార్​ కియా' సినిమాతో ఎంత క్రేజ్​ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
 
ఈ చిత్రం తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో విడుదలైంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలయ్యారు. తర్వాత బాలకృష్ణ నటించిన యువరత్నరాణా లో నటించి టాలీవుడ్‌కు మరింత దగ్గరయ్యారు. చేసింది కొన్ని సినిమాలే అయిన ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న ఆమె సడెన్‌ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇటీవల రాధేశ్యామ్‌తో రీఎంట్రీ ఇచ్చారు.
 
ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె కూతురు అవంతిక దుస్సాని టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే సినీరంగ ప్రవేశం చేసిన ఆమె బెల్లంకొండ హీరోతో టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. 
 
ప్రముఖ దర్శకులు తేజ శిష్యుడైన రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా సతీష్ వర్మ నిర్మిస్తున్న చిత్రం 'నేను స్టూడెంట్ సార్'. ఈ మూవీలో భాగ్యశ్రీ కూతురు అవంతిక దుస్సాని హీరోయిన్‌గా నటిస్తుంది. 
 
ప్రముఖ దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి కథ అందించారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఆమె ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments