గుజరాత్‌లోని వడోదరలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అద్దెకు వుంటున్న ఇద్దరు సోదరులు.. తమ యజమాని భార్యతోపాటు ఆమె కుమార్తెను బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. నగరంలో మోను అన్సారీ, మహోరామ్ అన్సారీ అనే ఇద్దరు సోదరులు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అయితే తమ ఇంటి యజమాని భార్యపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు మోనూ అన్సారీ. ఆ తర్వాత డబ్బులు కూడా డిమాండ్ చేశాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ రెండున్నరేళ్ల పాటు అనేక సార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత యజమాని కుమార్తెపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇవి తెలుసుకున్న మహోరామ్ అన్సారీ.. తల్లీకూతుళ్లను బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు వీరి ఆగడాలు భరించలేక యజమాని భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.